తొర్రూరు, వెలుగు: పెండింగ్‌లో ఉన్న డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలని రాష్ట్ర హౌసింగ్ డైరెక్టర్ వి.పి.గౌతమ్ ఆఫీసర్లను ఆదేశించారు. సోమవారం మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణంలోని 10వ వార్డులో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులను, నిర్మాణం పూర్తయిన ఇండ్లను పరిశీలించారు. అనంతరం చెర్లపాలెం రోడ్డులో నిర్మిస్తున్న డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లను పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా బిల్లులు చెల్లించాలని సూచించారు. డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లను పూర్తి చేసి అర్హులకు అందించాలని ఆదేశించారు. లబ్ధిదారుల ఎంపికలో అవకతవకలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శ్యాంసుందర్, ఆర్‌అండ్‌బీ అధికారులు, ఇరిగేషన్, హౌసింగ్ అధికారులు, కాంట్రాక్టర్, వార్డు అధికారులు పాల్గొన్నారు.
