కరీంనగర్ టౌన్, వెలుగు: కరీంనగర్‌లోని వావిలాలపల్లి ఆద్యా క్యాంపస్‌లో సోమవారం ఆల్ఫోర్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను చైర్మన్ నరేందర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్‌తో మానవాళికి ఎన్నో లాభాలు ఉంటాయని, విద్యార్థులు సరైన పద్ధతిలో ఉపయోగించుకుని, అవసరమైన సమాచారాన్ని సేకరించవచ్చని తెలిపారు.
ఏఐని సక్రమంగా ఉపయోగించుకుంటే విజయాలను సొంతం చేసుకోవచ్చన్నారు. రాష్ట్రంలోనే ఆల్ఫోర్స్ విద్యాసంస్థలో మొదటగా ఏఐని ప్రవేశపెట్టామని పేర్కొన్నారు. ఇది ఐఐటీ,నీట్ లాంటి పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న విద్యార్థులకు గొప్ప వరం లాంటిదన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్, సాఫ్ట్ నేర్ ప్రతినిధులు, టీచర్స్, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.
