ముగ్గురు కానిస్టేబుళ్ల కుటుంబాలకు3 కోట్లు

ముగ్గురు కానిస్టేబుళ్ల కుటుంబాలకు3 కోట్లు
  • రోడ్డు ప్రమాదాల్లో మృతి చెందడంతో బీమా చెక్కులు

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వెలుగు: విధి నిర్వహణలో ప్రమాదాల్లో మృతి చెందిన ముగ్గురు పోలీసు సిబ్బంది కుటుంబాలకు డీజీపీ సీవీ ఆనంద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బీమా పరిహారాన్ని అందించారు. ఒక్కొక్కరికి రూ.కోటి చొప్పున ఆయా కుటుంబాలకు బీమా చెక్కులను అందజేశారు. సోమవారం డీజీపీ కార్యాలయంలో చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన 2018 బ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఏఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కానిస్టేబుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ముత్తంగి శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, నల్లగొండ జిల్లా కనగల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పోలీస్ స్టేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో విధుల్లో   మరణించిన 2004 బ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పోలీసు హెడ్ కానిస్టేబుల్ బోలెపల్లి సైదులు, వరంగల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు చెందిన మరో కానిస్టేబుల్ కె. వెంకటరెడ్డి కుటుంబాలకు ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బీఐ ఇన్సూరెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ద్వారా చెక్కులను అందించారు.