నీళ్లిచ్చాకే గ్రామానికొస్తా : జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి

నీళ్లిచ్చాకే గ్రామానికొస్తా : జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి

జనగామ అర్బన్​(తరిగొప్పుల), వెలుగు: దసరాకు నీళ్లిచ్చాకే గ్రామానిక మళ్లొస్తానని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్​రెడ్డి అన్నారు. సోమవారం తరిగొప్పుల మండలంలోని అంకుశాపూర్​, సోలిపురం గ్రామాల్లో ఆయన వీవో భవనాల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామాభివృద్ది, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా రాజకీయాలకు  అతీతంగా అందరూ కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. 

తరిగొప్పుల పరిధిలోని 14-15 గ్రామాలు, తండాల సాగు, తాగునీటి ఎత్తిపోతల పథకం పనులు చివరి దశకు వచ్చాయని, దసరా పండుగ నాటికి అంకుశాపూర్​కు నీరు అందించి, 15 గ్రామాల చెరువులను కాళేశ్వరం నీటితో నింపుతానని స్పష్టం చేశారు. నీళ్లు అందించిన తర్వాతే మళ్లీ గ్రామానికి వస్తానని హామీ ఇచ్చారు.