జర్మనీ యూనివర్సిటీతో కేయూ కీలక ఒప్పందం

జర్మనీ యూనివర్సిటీతో కేయూ కీలక ఒప్పందం

హసన్ పర్తి, వెలుగు: తెలంగాణ విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయి ఉన్నత విద్యను అందించడమే లక్ష్యంగా కాకతీయ యూనివర్సిటీ మరో కీలక ముందడుగు వేసిందని యూనివర్సిటీ వీసీ కె. ప్రతాప్‌‌‌‌‌‌‌‌రెడ్డి తెలిపారు. జర్మనీలోని రూట్లింగెన్  యూనివర్సిటీతో కాకతీయ యూనివర్సిటీ ఒప్పందం  కుదుర్చుకుందన్నారు.

జర్మనీ పర్యటనలో ఉన్న కేయూ వీసీ, తెలంగాణ ప్రభుత్వ విద్యాశాఖ ప్రిన్సిపల్‌‌‌‌‌‌‌‌ సెక్రటరీ యోగితా రాణా సమక్షంలో ఈ ఒప్పంద ప్రక్రియ జరిగింది. హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లోని ఉస్మానియా యూనివర్సిటీలో జరిగిన అవగాహన ఒప్పంద పత్రాలను కేయూ రిజిస్ట్రార్  వి.రామచంద్రం ప్రతినిధులతో మార్చుకోగా, రూట్లింగెన్  యూనివర్సిటీ ప్రతినిధులు ప్రొఫెసర్  బ్రూనే జోచెన్, స్టెఫాన్  డెగ్లెమాన్  ఆన్‌‌‌‌‌‌‌‌లైన్  ద్వారా పాల్గొన్నారు.

ఈ ఒప్పందం ద్వారా కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులకు 3+2 మాస్టర్స్  ప్రోగ్రామ్  ద్వారా జర్మనీలో ఉన్నత విద్య అభ్యసించే అవకాశం లభించనుంది. మొదటి మూడేళ్ల విద్యను కాకతీయ యూనివర్సిటీలో పూర్తి చేసిన అనంతరం రెండేళ్ల మాస్టర్స్  కోర్సును రూట్లింగెన్  యూనివర్సిటీలో కొనసాగించవచ్చన్నారు.

ఇందులోభాగంగా కేయూ నుంచి 20 మంది విద్యార్థులను మెరిట్‌‌‌‌‌‌‌‌ కమ్‌‌‌‌‌‌‌‌ రిజర్వేషన్  ప్రాతిపదికన ఎంపిక చేయనున్నారు. ఎంపికైన విద్యార్థులకు జర్మనీలో ఉన్నత విద్యతో పాటు భవిష్యత్  ఉపాధి అవకాశాలకు కల్పించనున్నారు. కార్యక్రమంలో కేయూ ఓఎస్డీ  వెంకట్రాంరెడ్డి, రూసా నోడల్  అధికారి మల్లికార్జున్‌‌‌‌‌‌‌‌రెడ్డి పాల్గొన్నారు.