నల్గొండ: పోక్సో కేసులో నిందితుడికి 10 ఏళ్ల జైలు..బాధితురాలికి రూ.7 లక్షల పరిహారం

నల్గొండ: పోక్సో కేసులో  నిందితుడికి 10 ఏళ్ల జైలు..బాధితురాలికి రూ.7 లక్షల పరిహారం

నల్గొండ/దేవరకొండ, వెలుగు: పోక్సో కేసులో నిందితుడికి నల్లగొండ జిల్లా పోక్సో కోర్టు 10 ఏండ్ల జైలు శిక్ష విధించింది. బాధితురాలికి రూ.7 లక్షల ప‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రిహారం ప్రకటించింది. కేసు వివ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రాలు ఇలా ఉన్నాయి.2020 సెప్టెంబర్ 8న డిండి పోలీస్ స్టేషన్ పరిధిలో బాలికపై అత్యాచారం చేశాడని ప్రతాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు చెందిన మూడవత్ మల్లేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై కేసు నమోదైంది. 

పోలీసులు కీలక ఆధారాలు సేకరించి నిందితుడిపై చార్జిషీట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ దాఖలు చేశారు. కోర్టులో ప్రాసిక్యూషన్ తరఫున స్పెషల్ పీపీ వేముల రంజిత్ కుమార్ వాదనలు వినిపించారు. సాక్ష్యాధారాలను పరిశీలించిన జిల్లా పోక్సో కోర్టు నిందితుడు మల్లేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను దోషిగా తేల్చి శిక్ష విధించింది.