- బస్సు రన్నింగ్ లో ఉండగా డ్రైవర్ కు గుండెపోటు
- బస్సును పక్కకు ఆపడంతో 70 మందికి తప్పిన ప్రమాదం
- గుండెపోటుతో ప్రాణాలొదిలిన ఆర్టీసీ డ్రైవర్
- బస్సును పక్కకు ఆపడంతో 70 మందికి తప్పిన ప్రమాదం
పాపన్నపేట, వెలుగు : ఓ ఆర్టీసీ డ్రైవర్ విధుల్లో ఉండగానే గుండెపోటుకు గురయ్యాడు. వెంటనే బస్సును పక్కకు ఆపడంతో 70 మంది ప్రయాణికులకు ప్రమాదం తప్పింది. అనంతరం డ్రైవర్ స్టీరింగ్ మీదే కుప్పకూలి చనిపోయాడు. వివరాల్లోకి వెళ్తే... మెదక్ జిల్లా పాపన్నపేటకు చెందిన సురేందర్ (55) నారాయణఖేడ్ డిపోలో డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. సురేందర్ ఆదివారం నారాయణఖేడ్ నుంచి జేబీఎస్ బస్టాండ్ కు వచ్చాడు. రాత్రి 11 గంటల సమయంలో 70 మంది ప్రయాణికులను ఎక్కించుకొని నారాయణఖేడ్ తిరుగుపయనం అయ్యాడు. ఈ క్రమంలో సికింద్రాబాద్లోని తాడ్ బండ్ చౌరస్తా వద్దకు రాగానే గుండెపోటుకు గురయ్యాడు. వెంటనే బస్సును పక్కకు ఆపి స్టీరింగ్ పైన కుప్పకూలాడు.
