ఫుట్ బాల్ దిగ్గజం, అర్జెంటీనా సూపర్‌స్టార్ లియోనెల్ మెస్సీ రిటైర్మెంట్ ప్రకటించడంపై ప్రపంచ వ్యాప్తంగా ఫ్యాన్స్ షాకింగ్ కు గురయ్యారు. తమ అభిమాన ప్లేయర్ ఇంకొన్నాళ్లు ఆడితే బాగుంటుందని కోరుకుంటున్నారు. 2026లో స్పెయిన్‌తో జరిగిన ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్‌లో ఓడిపోయిన తర్వాత మెస్సీ అంతర్జాతీయ ఫుట్‌బాల్ నుంచి తప్పుకున్నట్లు ప్రకటించారు.
అయితే మెస్సీ రిటైర్మెంట్ ఇది తొలిసారి కాదు. 2016లో కోపా అమెరికా ఫైనల్‌లో చిలీ చేతిలో ఓడిపోయిన తర్వాత కూడా కెరీర్‌ను వదులుకుంటున్నట్లు ప్రకటించారు. ఆ సమయంలో మెస్సీ శాశ్వత ప్రత్యర్థి క్రిస్టియానో రోనాల్డో ఏమన్నారో ఇప్పుడు తెలుసుకుందాం.
2016లో కోపా అమెరికా ఫైనల్‌లో పెనాల్టీ మిస్ అయిన తర్వాత మెస్సీ కన్నీళ్లు పెట్టుకుని రిటైర్‌మెంట్ ప్రకటించారు. అప్పటికి మెస్సీ వయసు 29 ఏళ్లు మాత్రమే. ఈ నిర్ణయం ప్రపంచ ఫుట్‌బాల్ ప్రేమికులను షాక్‌కి గురిచేసింది.
రిటైర్మెంట్ విషయంలో రొనాల్డో అప్పట్లో మెస్సీకి మద్దతుగా నిలిచాడు. మెస్సీ కష్టమైన నిర్ణయం తీసుకున్నారు. ఫ్యాన్స్ అర్థం చేసుకోవాలి. ఓటములు, నిరాశలకు అలవాటు పడలేదు. రెండో స్థానాన్ని కూడా ఆయన జీర్ణించుకోలేకపోతున్నారు. పెనాల్టీ మిస్ అయినంత మాత్రాన ఆటగాడు చెడ్డవాడు కాడు.. ఏదేమైనా అలాంటి నిర్ణయం తీసుకోకుండా ఉండాల్సింది అంటూ అప్పట్లో స్పందించాడు. మెస్సీ కన్నీళ్లు పెట్టుకోవడం చూస్తే బాధగా ఉంది. ఆయన తన దేశం తరఫున మళ్లీ ఆడాలని నేను ఆశిస్తున్నానని అన్నారు.
ALSO READ : ఫుట్బాల్కు మెస్సీ గుడ్బై
రోనాల్డో ఆశించినట్టే మెస్సీ తిరిగి వచ్చారు. 2021, 2024లలో కోపా అమెరికా, 2022లో వరల్డ్ కప్ గెలుచుకున్నారు. ఇప్పుడు మళ్లీ రిటైర్‌మెంట్ ప్రకటించారు. కానీ ఈ సారి మళ్లీ తిరిగి వస్తారనే ఆశలు మాత్రం అటు ఫ్యాన్స్ లో ఇటు జట్టులో లేవు. అయితే మెస్సీ రిటైర్మెంట్ తర్వాత రొనాల్డో కూడా కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు ఊహాగానాలు వస్తున్నాయి. అయితే రొనాల్డో అంతర్జాతీయ భవిష్యత్తు గురించి ఇంకా స్పష్టం చేయలేదు.
