జ్యోతిష్యం: సింహరాశి.. ఆర్థికవ్యవహారాల్లో జాగ్రత్త అవసరం.. ఈ పరిహారాలు చేయండి ఇబ్బందులు ఉండవు..!

జ్యోతిష్యం: సింహరాశి.. ఆర్థికవ్యవహారాల్లో జాగ్రత్త అవసరం.. ఈ పరిహారాలు చేయండి ఇబ్బందులు ఉండవు..!

సెప్టెంబర్​ 2026 లో కొన్ని గ్రహాలు స్థానాలు మారుతున్నాయి.  ఈ ప్రభావం 12 రాశులవారిపై ఉంటుంది. జ్యోతిష్య నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏఏ గ్రహాలు మారుతున్నాయి.. వాటి స్థానాలు ఎక్కడ ఉన్నాయి.  సింహరాశిపై ఆ ప్రభావం ఎలా ఉంటుంది.. మొదలగు విషయాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం. . .! 

సెప్టెంబర్​ అనేక గ్రహాలు వాటి స్థానాలు మారుతున్నాయి.. జ్యోతిష్య పండితులు తెలిపిన వివరాల ప్రకారం వాటి వివరాలు ఇలా ఉన్నాయి.

సెప్టెంబర్​ లో స్థానాలు మారుతున్న గ్రహాలు

  • సెప్టెంబర్ 2:   తులా రాశిలోకి శుక్రుడు
  •  సెప్టెంబర్ 7: కన్యారాశిలోకి బుధుడు 
  •  సెప్టెంబర్ 17:   కన్యారాశిలోకి  సూర్యుడు
  •  సెప్టెంబర్ 18:  కర్కాటక రాశిలోకి కుజుడు 
  •  సెప్టెంబర్ 26: తులా రాశిలోకి  బుధుడు 

సింహరాశి వారికి సెప్టెంబర్​ 2026 మిశ్రమ ఫలితాలుంటాయని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. స్నేహితుల సహకారంతో వ్యాపారాన్ని ముందుకు నడిపిస్తారు. భౌతిక సుఖాలు పెరుగుతాయి. భూమి, ఇల్లు  వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంది. 

పసెఈ  నెల మొదటి వారంలో పని ఒత్తిడి లేదా మానసిక ఆందోళనలు ఉండే అవకాశం ఉంది. సహచరులు, అధికారుల మద్దతుతో పనులు పూర్తి చేయగలుగుతారు. ఖర్చులు పెరిగే అవకాశం ఉన్నందున ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్త అవసరమని పండితులు సూచిస్తున్నారు. తొందరపడి పెద్ద పెట్టుబడులు పెట్టకూడదు. నిద్రలేమి లేదా అలసట వంటి సమస్యలు రాకుండా తగిన విశ్రాంతి తీసుకోవడం మంచిది. 

ALSO READ : సెప్టెంబర్ నెల: కర్కాటక రాశి... కొత్త ఆశలు చిగురింపు..

ముఖ్యమైన  పనులు, వ్యవహారాల్లో కార్యసిద్ధి, వ్యవహార జయం ఉంటాయి. ఆర్థిక వ్యవహారాలు నిదానంగా పూర్తవుతాయి. వృథా ఖర్చులను వీలైనంతగా తగ్గించుకోవడం మంచిది. కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు తలెత్తే అవకాశం ఉంది. 

ధన స్థానంలోకి రవి, బుధ గ్రహాల రాకతో వృత్తి, ఉద్యోగ రంగాల్లో మంచి పురోగతి సాధించే అవకాశం ఉంది. ఉద్యోగంలో ఆశించిన స్థిరత్వం లభిస్తుంది. మీ ప్రతిభకు గుర్తింపు రావడంతో పాటు బాధ్యతలు పెరగవచ్చు.వ్యాపారులకు కూడా నెల ద్వితీయార్థం అనుకూలంగా ఉంటుంది. కొత్త ప్రయత్నాలు, కార్యక్రమాలు చేపట్టేందుకు సమయం కలిసి వస్తుంది. నిరుద్యోగులకు మంచి ఉద్యోగ ఆఫర్ అందే అవకాశం ఉంది.కొంతకాలంగా పరిష్కారం కాని ఒకటి, రెండు వ్యక్తిగత సమస్యలు కూడా పరిష్కారమయ్యే అవకాశం ఉంది.  వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి సానుకూల స్పందన లభించే అవకాశం ఉంది. 

పరిహారం:  నిత్యం ఆదిత్యస్తోత్రం .. మానసిక ప్రశాంతతకు   నవగ్రహ స్తోత్రం పారాయణం పఠించాలి

Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని జ్యోతిష్య నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించరు. మీకున్న  జ్యోతిష్య సమస్యలకు నిపుణులను సంప్రదించటం ఉత్తమం.