నీట్-యూజీ 2026 అభ్యర్థులు బీఅలర్ట్..MBBS ఫేజ్ 1 వెబ్ ఆప్షన్లకు రెండు గంటల సమయమే ఉంది. వెబ్ ఆప్షన్ల నమోదుకు చివరి గడువు సెప్టెంబర్ 1, మధ్యాహ్నం 12:00 గంటలకు ముగియనుంది. ఫేజ్-1లో వెబ్ ఆప్షన్లు నమోదు చేయని అభ్యర్థులు తదుపరి కౌన్సెలింగ్ దశల్లో వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకునేందుకు అర్హులు కారు, అభ్యర్థులు చివరి నిమిషం వరకు వేచి ఉండకుండా వెంటనే వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవాలని కాళోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీ అధికారులు తెలిపారు. అభ్యర్థులు మెడికల్ కాలేజీలను ప్రాధాన్యత క్రమంలో ఎంపిక చేసుకోవాలి. వెబ్‌సైట్: tsmedadm.tsche.in/ గడువు ముగిసేలోపు వెబ్ ఆప్షన్లు తప్పనిసరిగా సేవ్ చేయాలని KNRUHS సూచించింది.
