పాపన్నపేట, వెలుగు: విద్యార్థినులతో అనుచితంగా ప్రవర్తించాడన్న ఆరోపణతో పాపన్నపేట హైస్కూల్ టీచర్‌ను మెదక్ డీఈవో రాజు సోమవారం సస్పెండ్ చేశారు. తెలుగు స్కూల్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న మంగ నర్సింలు విద్యార్థినులతో అనుచితంగా ప్రవర్తిస్తూ, కించపరిచేలా మాట్లాడుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.
కొందరు స్టూడెంట్స్ 1098 కు కాల్ చేసి సదరు టీచర్‌పై ఫిర్యాదు చేశారు. స్పందించిన ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ అధికారులు స్కూల్‌కు వచ్చి విచారించారు. విచారణ నివేదిక అందడంతో టీచర్ నర్సింలును సస్పెండ్ చేసినట్లు డీఈవో తెలిపారు.
