జనగామ: ఎరువుల బుకింగ్‌‌‌‌కు కొత్త యాప్‌‌‌‌

జనగామ: ఎరువుల బుకింగ్‌‌‌‌కు కొత్త యాప్‌‌‌‌

జనగామ, వెలుగు: ఎరువుల బుకింగ్‌‌‌‌ ప్లాట్‌‌‌‌ఫామ్‌‌‌‌ మారింది. ఇప్పటి వరకు యూరియా యాప్‌‌‌‌లో బుకింగ్‌‌‌‌ చేసుకునే రైతులు, సెప్టెంబర్‌‌‌‌ 1 నుంచి యూరియాతో పాటు అన్ని రకాల ఎరువులను ఫ్రేమ్‌‌‌‌వర్క్‌‌‌‌ ఫర్‌‌‌‌ ఫర్టిలైజర్‌‌‌‌ సేల్‌‌‌‌ (ఎఫ్‌‌‌‌ఎఫ్‌‌‌‌ఎస్‌‌‌‌) యాప్‌‌‌‌ ద్వారా బుక్‌‌‌‌ చేసుకోవాల్సి ఉంటుంది. జనగామ జిల్లాలో 4.67 లక్షల ఎకరాల సాగు భూమి ఉండగా, సుమారు 1.98 లక్షల మంది రైతులు 3.67 లక్షల ఎకరాల్లో పంటలు సాగు చేస్తున్నారు.

ఒక్కో సీజన్‌‌‌‌కు సుమారు 26 వేల టన్నుల యూరియా అవసరమని అగ్రికల్చర్​ డిపార్ట్​మెంట్​ చెబుతోంది. రైతులు ఫోన్‌‌‌‌లో ఎఫ్‌‌‌‌ఎఫ్‌‌‌‌ఎస్‌‌‌‌ యాప్‌‌‌‌ను డౌన్‌‌‌‌లోడ్‌‌‌‌ చేసుకుని ఫార్మర్‌‌‌‌ ఐడీతో లాగిన్‌‌‌‌ కావాలి. అగ్రిస్టాక్‌‌‌‌లో అందుబాటులో ఉన్న ఎరువుల వివరాలను పరిశీలించి అవసరమైన వాటిని బుక్‌‌‌‌ చేసుకోవాలి. అనంతరం ఎంపిక చేసుకున్న ఎరువుల దుకాణానికి వెళ్లి బుకింగ్‌‌‌‌ వివరాలు చూపించి ఎరువులు తీసుకోవచ్చు.