ఖిలా వరంగల్: పేదలకు మెరుగైన కంటి వైద్యం అందించడమే లక్ష్యం : ఎర్రబెల్లి ప్రదీప్రావు

ఖిలా వరంగల్: పేదలకు మెరుగైన కంటి వైద్యం అందించడమే లక్ష్యం : ఎర్రబెల్లి ప్రదీప్రావు

ఖిలా వరంగల్ (కరీమాబాద్), వెలుగు :  పేదలకు మెరుగైన కంటి వైద్యం అందించమే లక్ష్యమని బీజేపీ రాష్ట్ర నాయకులు, వరంగల్​అర్బన్​ కో ఆపరేటివ్​ బ్యాంక్​ చైర్మన్​ ఎర్రబెల్లి ప్రదీప్​రావు అన్నారు. సోమవారం వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని ఇసుక అడ్డ పోర్ట్ రోడ్‌‌‌‌లో ఎర్రబెల్లి ప్రదీప్ రావు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో, శంకర్ కంటి ఆస్పత్రి సహకారంతో నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. ట్రస్ట్ చైర్మన్ ఎర్రబెల్లి వినీత్ రావు ఆధ్వర్యంలో జరిగిన ఈ శిబిరంలో సుమారు 1,500 మంది కంటి పరీక్షలు చేయించుకున్నారు. 

ఈ సందర్భంగా ఎర్రబెల్లి ప్రదీప్ రావు మాట్లాడుతూ 1,000 మందికి కంటి అద్దాలు అందించామని, 100 మందిని రెటీనా, ఇతర శస్త్రచికిత్సల కోసం హైదరాబాద్‌‌‌‌కు పంపినట్లు తెలిపారు. శిబిరానికి సహకరించిన శంకర్ కంటి ఆస్పత్రి సిబ్బంది, క్రీడో లైఫ్ సైన్స్ డైరెక్టర్ ఆలూరు వంశీకృష్ణ, ట్రస్ట్ చైర్మన్ ఎర్రబెల్లి వినీత్ రావుకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. మాజీ మేయర్ తక్కెళ్లపల్లి రాజేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే కొండేటి శ్రీధర్, రావు పద్మ తదితరులున్నారు.