Apple CEO గా చివరి రోజు.. టిమ్ కుక్ భావోద్వేగ సందేశం!

Apple CEO గా చివరి రోజు.. టిమ్ కుక్ భావోద్వేగ సందేశం!

యాపిల్ సీఈవోగా 15 ఏళ్ల ప్రస్థానం.. 30 ఏళ్లుగా కంపెనీతో ప్రయాణం.. కంపెనీని హార్డ్ వేర్ నుంచి వివిధ ప్రొడక్టివిటీలోకి మార్చడం.. స్టీవ్ జాబ్స్ నుంచి తీసుకున్న బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తూ గూగుల్, మైక్రోసాఫ్ట్, ఐబీఎం లాంటి కంపెనీలకు ధీటుగా టాప్ కంపెనీగా కొనసాగించడం.. ఇవి.. సీఈవోగా టిమ్ కుక్ సాధించిన విజయాలు.  

యాపిల్ సీఈఓగా టిమ్ కుక్15 ఏళ్ల ప్రస్థానం ముగిసింది. కంపెనీ సీఈవోగా చివరి రోజు కావడంతో భావోద్వేగ సందేశాన్ని పంచుకున్నారు. 2011 లో కంపెనీ కో ఫౌండర్ స్టీ జాబ్స్ నుంచి బాధ్యతలు అందుకున్న స్టీవ్.. స్టీవ్ లేని లోటును పూడ్చుతూ.. ఇంటర్నేషనల్ మార్కెట్ లో కంపెనీ బ్రాండ్ ను, అగ్రస్థానాన్ని కోల్పోకుండా సక్సెస్ ఫుల్ గా నడిపిస్తూ వస్తున్నారు. ఆయన స్థానంలో జాన్ టెర్నస్ సీఈఓ బాధ్యతలు చేపట్టనున్నారు. 

 యాపిల్ కంపెనీ సీఈఓగా పనిచేయడం జీవితంలో లభించిన ఒక గొప్ప అవకాశం అని కుక్ ఆపిల్ ఉద్యోగులతో పంచుకున్నారు.   తన విజయం వెనుక  సిబ్బందే ఉన్నారని నొక్కి చెప్పారు. మీరు నాలో ఉన్న బెస్ట్ ను మీరు వెలికితీశారు..  నా జీవితంలో ఇంత  ఇంత అద్భుతమైన టీమ్ ను ఎప్పుడూ చూడలేదని..  ఇంతకు ముందెన్నడూ చూడకపోవచ్చునని ఉద్యోగులతో పంచుకున్నారు.   

టిమ్ కుక్ షేర్ చేసిన మెమోలో.. స్టీవ్ జాబ్స్ చెప్పిన మాటను ప్రస్థావించారు. విశ్వంలో మనదంటూ ఒక ముద్ర వేసేలా మన పని ఉండాలని చెప్పిన  ప్రసిద్ధ వాక్యాన్ని కూడా ప్రస్తావిస్తూ, ఇప్పటికీ  ఆపిల్ సంస్థ జాబ్స్ ఆశించిన మార్గంలోనే ముందుకు సాగుతుందని అన్నారు. 

స్టీవ్ ఒకప్పుడు చెప్పినట్లు.. విశ్వంలో మా ముద్ర వేయడం మాకు సాధ్యమైంది. దానికి కారణం మేమే, మేం దేనిని నమ్ముతామో, దేనికి విలువ ఇస్తామో, ప్రపంచాన్ని మేం ఎలా చూస్తామో అనేదే మమ్మల్ని విజయ పథంలో తీసుకెళ్లిందని  కుక్ వివరించారు.

తదుపరి సీఈవో జాన్ టెర్నస్ గురించి టిమ్ కుక్..

టిమ్ కుక్ తన 65 ఏళ్ల వయసులో ఆపిల్ సీఈవోగా వైదొలగుతున్నారు. అయితే ఎక్జిక్యూటివ్ చైర్మన్ గా కంపెనీని పర్యవేక్షిస్తారు.  ఆయన స్థానంలో జాన్ టెర్నస్ బాధ్యతలు తీసుకోనున్నారు. 

టిమ్ మెమోలో జాన్ టెర్నస్ గురించి ప్రస్థావించారు. కంపెనీ సీఈవో బాధ్యతలు అత్యంత తెలివైన, అద్భుతమైన వ్యక్తికి అప్పగించడం సంతోషంగా ఉందన్నారు. జాన్ టెరర్స్ తప్ప మరెవరూ ఆ బాధ్యతలు మోయలేరని చెప్పారు. 

అదే విధంగా ఆపిల్ కమ్యూనిటీకి ఎక్స్ లో కృతజ్ఞతలు తెలిపారు. ఆపిల్ కమ్యూనిటీపై తనకున్న ప్రేమ ఎప్పటికీ తగ్గదని పేర్కొన్నారు. రేపటి నుంచి నా టైటిల్ మారుతుండొచ్చు.. కానీ ఉద్యోగులు, సిబ్బందిపై తన ప్రేమ మారదని ఎక్స్ లో పోస్ట్ చేశారు. 

అత్యంత విలువైన కంపెనీగా తీర్చిదిద్దిన కుక్:

కుక్ దాదాపు 30 ఏళ్లుగా ఆపిల్‌తో ఉన్నారు. ఆపిల్ కో ఫైండర్ స్టీవ్ జాబ్స్ ప్యాంక్రియాటిక్ క్యాన్సర్‌తో మరణించడానికి కేవలం కొన్ని వారాల ముందు, ఆగస్టు 2011లో ఆయన సీఈఓగా బాధ్యతలు స్వీకరించారు. సీఈఓగా ఆయన హయాంలో, కంపెనీ ఆపిల్ వాచ్ , ఎయిర్‌పాడ్స్‌తో సహా కొత్త ఉత్పత్తులను విడుదల చేసింది,   ఐఫోన్, ఐప్యాడ్ ,మ్యాక్ శ్రేణులను విస్తరించింది.

టిమ్ కుక్ నాయకత్వంలో, ఆపిల్ ప్రపంచంలోనే అత్యంత విలువైన కంపెనీలలో ఒకటిగా ఎదిగింది. 2026 ఆగస్టు 31  నాటికి  మార్కెట్ విలువ 4.5 ట్రిలియన్ డాలర్లను దాటింది. ఆగస్టు 2011లో, ఆపిల్ విలువ 350 బిలియన్ డాలర్లుగా ఉండేది.

కుక్ ముఖ్యంగా ఆపిల్‌ను హార్డ్‌వేర్‌కు మించి విస్తరించడంపై దృష్టి పెట్టారు. యాప్ స్టోర్, ఆపిల్ మ్యూజిక్, ఆపిల్ పే వంటి సేవలు వ్యాపారంలో పెద్ద భాగంగా మారాయి.

జాన్ టెర్నస్ ఎవరు?

51 ఏళ్ల జాన్ టెర్నస్, 2001లో ఆపిల్ డిజైన్ బృందంలో చేరారు. తరువాత హార్డ్‌వేర్ ఇంజనీరింగ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అయ్యారు. కుక్‌కు నేరుగా రిపోర్ట్ చేసేవారు.  ఐఫోన్‌తో సహా ఆపిల్  పూర్తి స్థాయి ఉత్పత్తుల వెనుక ఉన్న ఇంజనీరింగ్ టీమ్ ను టెర్నస్ పర్యవేక్షించారు. 

ఆపిల్ సిలికాన్ (మ్యాక్‌ల కోసం M సిరీస్ చిప్‌లు)కు మారడంలో టెర్నస్ దగ్గరగా పాలుపంచుకున్నారని, ఐఫోన్ ఎయిర్‌తో సహా ఇటీవలి హార్డ్‌వేర్ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారని చెబుతున్నారు.

రాబోయే ఆపిల్ ఈవెంట్‌కు కొద్ది రోజుల ముందు టెర్నస్ ఆపిల్ సీఈఓగా బాధ్యతలు చేపట్టనున్నారు. సెప్టెంబర్ 9న జరగనున్న ఈ కార్యక్రమంలో, ఐఫోన్ 18 ప్రో సిరీస్, మొట్టమొదటి ఫోల్డబుల్ ఐఫోన్‌ను ఆవిష్కరించడానికి జాన్ టెర్నస్ వేదికపైకి రానున్నారని  తెలుస్తోంది.