బంగ్లాదేశ్, జింబాబ్వే, ఆఫ్ఘనిస్థాన్ వన్డే ట్రై సిరీస్.. షెడ్యూల్, స్క్వాడ్స్ వివరాలు ఇవే!

బంగ్లాదేశ్, జింబాబ్వే, ఆఫ్ఘనిస్థాన్ వన్డే ట్రై సిరీస్.. షెడ్యూల్, స్క్వాడ్స్ వివరాలు ఇవే!

2027 ఐసీసీ పురుషుల క్రికెట్ వన్డే ప్రపంచ కప్‌నకు ఆయా జట్ల సన్నాహకాల్లో భాగంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) వేదికగా బాంగ్లాదేశ్, జింబాబ్వే, ఆఫ్ఘనిస్థాన్ జట్ల మధ్య ప్రతిష్టాత్మక ముక్కోణపు వన్డే సిరీస్ (ODI Tri-Series 2026) రేపటి (2026, అక్టోబర్ 17, శనివారం) నుంచి ప్రారంభం కానుంది. అక్టోబర్ 23 వరకు సాగే ఈ టోర్నీలో మొత్తం 4 మ్యాచ్‌లు జరగనున్నాయి. లీగ్ దశలో ప్రతి జట్టు మిగతా రెండు జట్లతో ఒక్కో మ్యాచ్ చొప్పున తలపడుతుంది. పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచిన టాప్-2 జట్లు అక్టోబర్ 23వ తేదీన జరిగే ఫైనల్ పోరులో ట్రోఫీ కోసం పోటీ పడతాయి.

‌‌ఇరు జట్ల వ్యూహాలు: 

* వరల్డ్ కప్ కాంబినేషన్లను పరీక్షించుకునేందుకు, ప్లేయర్ల ఫామ్‌ను అసెస్ చేసుకునేందుకు ఈ సిరీస్ మూడు జట్లకు ఎంతో కీలకంగా మారింది. 

* బంగ్లాదేశ్: వికెట్ కీపర్ బ్యాటర్ లిటన్ దాస్ (Litton Das) సారథ్యంలో బంగ్లాదేశ్ బరిలోకి దిగుతోంది. తౌహిద్ హృదయ్ వైస్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు.

* ఆఫ్ఘనిస్థాన్: స్టార్ బ్యాటర్ రహ్మత్ షా (Rahmat Shah) కెప్టెన్‌గా, రహ్మానుల్లా గుర్బాజ్ డిప్యూటీగా ఎంపికయ్యారు. రషీద్ ఖాన్, నబీ లాంటి స్టార్లతో టీమ్ బలంగా ఉంది.

జింబాబ్వే: వెటరన్ ఆల్ రౌండర్ సికిందర్ రజా (Sikandar Raza) సారథ్యంలో పోరాటానికి రెడీ అయింది. 

లైవ్ స్ట్రీమింగ్ వివరాలు: 

* భారత్‌లో: భారతదేశంలోని క్రికెట్ అభిమానులు ఈ సిరీస్ ప్రత్యక్ష ప్రసారాలను FanCode (ఫ్యాన్‌కోడ్) యాప్, వెబ్‌సైట్‌లో చూడవచ్చు.

* బంగ్లాదేశ్‌లో: T Sports, Tapmad డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో వీక్షించవచ్చు.

* ఆఫ్ఘనిస్థాన్‌లో: Ariana Television నెట్‌వర్క్ ప్రసారం చేయనుంది.

వన్డే ట్రై-సిరీస్ పూర్తి షెడ్యూల్: 
 

*      తేదీ                                          మ్యాచ్                                                                         వేదిక 
* అక్టోబర్ 17                  బంగ్లాదేశ్ vs జింబాబ్వే                     అబుదాబి (Abu Dhabi)
* అక్టోబర్ 19                  ఆఫ్ఘనిస్థాన్ vs జింబాబ్వే                                          అబుదాబి (Abu Dhabi)
* అక్టోబర్ 21                  ఆఫ్ఘనిస్థాన్ vs బంగ్లాదేశ్                                        షార్జా (Sharjah)
* అక్టోబర్ 23                  ఫైనల్ (Final)                                                        షార్జా (Sharjah)

ముక్కోణపు సిరీస్ పూర్తి జట్లు: 

బంగ్లాదేశ్ జట్టు: లిటన్ దాస్ (కెప్టెన్), తౌహిద్ హృదయ్ (వైస్ కెప్టెన్), తాంజిద్ హసన్ తమీమ్, సైఫ్ హసన్, సౌమ్య సర్కార్, నజ్ముల్ హొస్సేన్ శాంటో, మొసద్దెక్ హొస్సేన్, మెహిదీ హసన్ మిరాజ్, నురుల్ హసన్, రిషద్ హొస్సేన్, తాన్వీర్ ఇస్లామ్, తస్కిన్ అహ్మద్, ముస్తాఫిజుర్ రెహ్మాన్, హసన్ మహమూద్, షోరిఫుల్ ఇస్లామ్, అలిస్ అల్ ఇస్లామ్.

ALSO READ : బౌలర్లను బలి చేయకండి: IND vs WI మ్యాచ్కి ముందు బీసీసీఐకి మాజీ సెలక్టర్ కీలక సూచన

అఫ్గానిస్థాన్ జట్టు: రహ్మత్ షా (కెప్టెన్), రహ్మానుల్లా గుర్బాజ్ (వైస్ కెప్టెన్), ఇక్రమ్ అలీఖిల్, సెదిఖుల్లా అటల్, ఇబ్రహీం జద్రాన్, హష్మతుల్లా షాహిదీ, అజ్మతుల్లా ఒమర్‌జాయ్, మహమ్మద్ నబీ, రషీద్ ఖాన్, నంగేయాలియా ఖాన్, AM గజన్‌ఫర్, బిలాల్ సమీ, జియా ఉర్ రెహ్మాన్ షరీఫీ, ఫజల్హక్ ఫారూకీ, యామిన్ అహ్మద్‌జాయ్. 

జింబాబ్వే జట్టు: సికిందర్ రజా (కెప్టెన్), బెన్ కుర్రాన్, బ్లెస్సింగ్ ముజారబానీ, బ్రాడ్ ఎవాన్స్, బ్రెండన్ టేలర్, బ్రియాన్ బెన్నెట్, క్రెయిగ్ ఎర్విన్, ఎర్నెస్ట్ మసుకు, న్యూమాన్ నియామ్‌హురి, ర్యాన్ బర్ల్, తాడివనాషే మరుమని, తఫాద్వా త్సిగా, విన్సెంట్ మసేకేసా, వెల్లింగ్టన్ మసకడ్జా, వెస్లీ మధేవేరే.