- ఎంపీ రఘునందన్‌రావు, ఎమ్మెల్యే ప్రభాకర్‌రెడ్డి
తొగుట, వెలుగు: ప్రభుత్వ స్కూళ్ల అభివృద్ధికి ప్రతిఒక్కరూ కృషి చేయాలని మెదక్ ఎంపీ రఘునందన్‌రావు, దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి సూచించారు. అక్బర్ పేట్-భూంపల్లి మండలం రామేశ్వరపల్లిలో హైస్కూల్‌కు కాంపౌండ్, భూంపల్లిలో రెండు మంచినీటి ట్యాంకుల నిర్మాణానికి భూమి పూజ, మహిళా భవనం ప్రారంభోత్సవం, పాఠశాల క్రీడోత్సవాలను ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్యతో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ బడుల్లో మంచి టీచర్లు ఉన్నారని, వసతులు కల్పిస్తే ప్రైవేటుకు దీటుగా రిజల్ట్స్ వస్తాయన్నారు. స్కూళ్ల అభివృద్ధికి సర్పంచులు, దాతలు ముందుకు రావాలన్నారు. కాగా ఒకే కారులో ఎంపీ, ఎమ్మెల్యే రావడంతో జనం కొంత ఆశ్చర్యానికి గురయ్యారు.
