రాహుల్ గాంధీపై ఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఐఆర్‌ ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బీజేపీ నిరంకుశత్వానికి నిదర్శనం..కేంద్రంపై మంత్రి పొన్నం ఆగ్రహం

రాహుల్ గాంధీపై ఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఐఆర్‌ ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బీజేపీ నిరంకుశత్వానికి నిదర్శనం..కేంద్రంపై మంత్రి పొన్నం ఆగ్రహం

హుస్నాబాద్, వెలుగు: దళితులపై జరుగుతున్న వివక్ష, అంటరానితనానికి వ్యతిరేకంగా గళం వినిపించిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై ఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఐఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నమోదు చేయడం బీజేపీ నిరంకుశ వైఖరికి నిదర్శనమని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు సోమవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. 

ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఎదుర్కొన్న అవమానకర పరిస్థితులపై రాహుల్ గాంధీ ప్రశ్నిస్తే, ఆ సమస్యను పరిష్కరించాల్సిన ప్రభుత్వం.. ఆయనపైనే కేసులు పెట్టడం దురదృష్టకరమని అన్నారు.