సిద్దిపేట, వెలుగు: ఆరు గ్యారంటీలు, 420 హామీల పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. తెలంగాణ ప్రజలను దగా చేసిందని మాజీ మంత్రి హరీశ్‌రావు ఆరోపించారు. సోమవారం రాత్రి హైదరాబాద్‌లోని ఎమ్మెల్యే సునితా లక్ష్మారెడ్డి ఇంట్లో ఉమ్మడి మెదక్ జిల్లా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ముఖ్యనాయకులతో ఆయన మీటింగ్ నిర్వహించనున్నారు. సెప్టెంబర్ 2 నుంచి వారం పాటు కాంగ్రెస్ ప్రభుత్వ 1000 రోజుల అసమర్థ పాలనపై బీఆర్ఎస్ నిర్వహించనున్న నిరసన కార్యక్రమాలపై దిశా నిర్దేశం చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి హయాంలో కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలన రాష్ట్ర ప్రజల పాలిట శాపంగా మారిందన్నారు. రాష్ట్రం అన్ని రంగాల్లో కుదేలయిందన్నారు. కరెంట్ కోతలు, ఎరువుల కొరతతో పల్లెల్లో రైతులు మళ్లీ పాత రోజులను చూస్తున్నారన్నారు. సమావేశంలో ఎమ్మెల్యేలు మాణిక్ రావు, చింతా ప్రభాకర్, గూడెం మహిపాల్ రెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి, కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్సీ యాదవ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు పద్మా దేవేందర్ రెడ్డి, చంటి క్రాంతి కిరణ్, భూపాల్ రెడ్డి, శశిధర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ శేరి సుభాశ్‌రెడ్డి పాల్గొన్నారు.
