ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలెక్షన్ (ఐబీపీఎస్) రీజినల్ రూరల్ బ్యాంక్స్ (ఆర్ఆర్ బీ) ఉమ్మడి నియామక ప్రక్రియ (సీఆర్పీ ఆర్‌ఆర్‌బీ -XV)–2026 నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న వివిధ గ్రామీణ బ్యాంకుల్లో గ్రూప్–ఎ ఆఫీసర్లు (స్కేల్-I, II, III), గ్రూప్–బి ఆఫీస్ అసిస్టెంట్ (మల్టీపర్పస్) పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా అప్లై చేయవచ్చు.
అప్లికేషన్ ప్రక్రియ సెప్టెంబర్ 1న ప్రారంభం కాగా, సెప్టెంబర్ 21 వరకు అప్లై చేసుకోవచ్చు.
ఆఫీస్ అసిస్టెంట్ (మల్టీపర్పస్)
విద్యార్హత:
గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా విభాగంలో బ్యాచిలర్స్ డిగ్రీ పూర్తిచేసి ఉండాలి. అభ్యర్థులు సంబంధిత ఆర్ఆర్బి నిర్దేశించిన స్థానిక భాషలో ప్రావీణ్యం కలిగి ఉండాలి. కంప్యూటర్ అప్లికేషన్స్పై ప్రాథమిక అవగాహన లేదా పరిజ్ఞానం ఉండటం అదనపు అర్హతగా పరిగణిస్తారు.
వయోపరిమితి:
18 నుంచి 28 ఏళ్ల మధ్యలో ఉండాలి. ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ/ ఎస్టీలకు ఐదేళ్లు, పీడబ్ల్యూబీడీలకు పదేళ్లు వయోపరిమితిలో సడలింపు వర్తిస్తుంది.
సెలెక్షన్ ప్రాసెస్:
ప్రిలిమినరీ, మెయిన్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
ప్రిలిమినరీ ఎగ్జామ్: 2026, డిసెంబర్ 6, 12, 13.
మెయిన్ ఎగ్జామ్: 2027, జనవరి 30.
ఆఫీసర్ స్కేల్–I (అసిస్టెంట్ మేనేజర్)
విద్యార్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా కోర్సులో డిగ్రీ పూర్తిచేసి ఉండాలి. వ్యవసాయం, హార్టికల్చర్, ఫారెస్ట్రీ, పశుసంవర్ధకశాఖ, వెటర్నరీ సైన్స్, అగ్రికల్చరల్ ఇంజినీరింగ్, పిసికల్చర్, అగ్రికల్చరల్ మార్కెటింగ్ అండ్ కో–ఆపరేషన్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, మేనేజ్‌మెంట్, లా, ఎకనామిక్స్ లేదా అకౌంటెన్సీలో డిగ్రీ ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యం ఇస్తారు. అలాగే స్థానిక భాషలో మంచి పట్టు ఉండటంతోపాటు కంప్యూటర్ జ్ఞానం కూడా తప్పనిసరి.
వయోపరిమితి: 18 నుంచి 30 ఏళ్ల మధ్యలో ఉండాలి. ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ/ ఎస్టీలకు ఐదేళ్లు, పీడబ్ల్యూబీడీలకు పదేళ్లు వయోపరిమితిలో సడలింపు వర్తిస్తుంది.
సెలెక్షన్ ప్రాసెస్: ప్రిలిమినరీ, మెయిన్ ఎగ్జామినేషన్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
ప్రిలిమినరీ ఎగ్జామ్: 2026, నవంబర్ 21, 22.
మెయిన్ ఎగ్జామ్: 2026, డిసెంబర్ 20.
ఇంటర్వ్యూ: 2027, జనవరి/ ఫిబ్రవరి.
ఆఫీసర్ స్కేల్–II జనరల్ బ్యాంకింగ్ ఆఫీసర్ (మేనేజర్)
విద్యార్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా డిగ్రీలో కనీసం 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించాలి. దీంతోపాటు బ్యాంకింగ్ లేదా ఆర్థిక సంస్థల్లో నిర్దేశిత అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 21 నుంచి 32 ఏళ్ల మధ్యలో ఉండాలి. ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ/ ఎస్టీలకు ఐదేళ్లు, పీడబ్ల్యూబీడీలకు పదేళ్లు వయోపరిమితిలో సడలింపు వర్తిస్తుంది.
సెలెక్షన్ ప్రాసెస్: ఆన్‌లైన్ ఎగ్జామినేషన్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
ఆఫీసర్ స్కేల్-II స్పెషలిస్ట్ ఆఫీసర్ (మేనేజర్)
విద్యార్హత: ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, చార్టర్డ్ అకౌంటెన్సీ, లా, ట్రెజరీ, మార్కెటింగ్ లేదా అగ్రికల్చర్ వంటి సంబంధిత స్పెషలైజేషన్‌లో తగిన అర్హతతోపాటు నిర్దేశిత అనుభవం కలిగి ఉండాలి.
వయోపరిమితి: 21 నుంచి 32 ఏళ్ల మధ్యలో ఉండాలి. ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ/ ఎస్టీలకు ఐదేళ్లు, పీడబ్ల్యూబీడీలకు పదేళ్లు వయోపరిమితిలో సడలింపు వర్తిస్తుంది.
సెలెక్షన్ ప్రాసెస్: ఆన్‌లైన్ ఎగ్జామినేషన్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
సింగల్ ఎగ్జామ్: డిసెంబర్ 20.
ఇంటర్వ్యూ: 2027, జనవరి/ ఫిబ్రవరి.
ఆఫీసర్ స్కేల్–III (సీనియర్ మేనేజర్)
విద్యార్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా డిగ్రీలో కనీసం 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. దీనితోపాటు ఏదైనా బ్యాంకు లేదా ఆర్థిక సంస్థలో ఆఫీసర్‌గా కనీసం ఐదేళ్ల అనుభవం కలిగి ఉండాలి.
వయోపరిమితి: 21 నుంచి 32 ఏళ్ల మధ్యలో ఉండాలి. ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ/ ఎస్టీలకు ఐదేళ్లు, పీడబ్ల్యూబీడీలకు పదేళ్లు వయోపరిమితిలో సడలింపు వర్తిస్తుంది.
సెలెక్షన్ ప్రాసెస్: ఆన్‌లైన్ ఎగ్జామినేషన్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
సింగల్ ఎగ్జామ్: డిసెంబర్ 20.
ఇంటర్వ్యూ: 2027, జనవరి/ ఫిబ్రవరి.
అప్లికేషన్: ఆన్‌లైన్ ద్వారా.
అప్లికేషన్ ప్రారంభం: సెప్టెంబర్ 1.
లాస్ట్ డేట్: సెప్టెంబర్ 21.
ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ (పీఈటీ): 2026, నవంబర్
మరిన్ని వివరాలకు వెబ్సైట్ www.ibps.inను సందర్శించండి.
ప్రిలిమినరీ ఎగ్జామ్
ఐబీపీఎస్ ఆర్‌ఆర్‌బీ ప్రిలిమినరీ పరీక్ష కేవలం ఆఫీస్ అసిస్టెంట్ (మల్టీపర్పస్), ఆఫీసర్ స్కేల్-–I (అసిస్టెంట్ మేనేజర్) పోస్టులకు మాత్రమే ఉంటుంది. ఆన్‌లైన్ విధానంలో నిర్వహించే ఈ పరీక్షలో ప్రశ్నలు మల్టిపుల్ చాయిస్ రూపంలో ఉంటాయి. మొత్తం 80 ప్రశ్నలు ఇస్తారు. 80 మార్కులకు ఎగ్జామ్ ఉంటుంది. రీజనింగ్ ఎబిలిటీ నుంచి 40 ప్రశ్నలు 40 మార్కులకు, న్యూమరికల్ ఎబిలిటీ నుంచి 40 ప్రశ్నలు 40 మార్కులకు ఇస్తారు. నెగెటివ్ మార్కింగ్ ఉంది. ప్రతి తప్పు తప్పు సమాధానానికి 0.25 మార్కులు కోత కోస్తారు.
మెయిన్ ఎగ్జామినేషన్
ప్రిలిమినరీ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు ఆఫీస్ అసిస్టెంట్, ఆఫీసర్ స్కేల్–-I మెయిన్ పరీక్షలకు హాజరవుతారు. అలాగే ఆఫీసర్ స్కేల్–-II, III పోస్టులకు నేరుగా సింగిల్ ఆన్‌లైన్ పరీక్ష ఉంటుంది. ఆన్‌లైన్ విధానంలో నిర్వహించే ఈ పరీక్షలో ప్రశ్నలు మల్టిపుల్ చాయిస్ రూపంలో ఉంటాయి. మొత్తం 200 ప్రశ్నలు ఇస్తారు. 200 మార్కులకు ఎగ్జామ్ ఉంటుంది. రీజనింగ్ ఎబిలిటీ నుంచి 40 ప్రశ్నలు 50 మార్కులకు, కంప్యూటర్ నాలెడ్జ్ నుంచి 40 ప్రశ్నలు 20 మార్కులకు, జనరల్ అవేర్నెస్ (బ్యాంకింగ్, కరెంట్ అఫైర్స్) నుంచి 40 ప్రశ్నలు 40 మార్కులకు, ఇంగ్లిష్ లాంగ్వేజ్ లేదా హిందీ లాంగ్వేజ్ నుంచి 40 ప్రశ్నలు 40 మార్కులకు, న్యూమరికల్ ఎబిలిటీ / క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ నుంచి 40 ప్రశ్నలు 50 మార్కులకు ఇస్తారు. నెగెటివ్ మార్కింగ్ ఉంది. ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కులు కోత కోస్తారు.
ఆఫీసర్ స్కేల్–-II, స్కేల్–-III పోస్టులకూ సింగిల్ పరీక్ష ఉంటుంది. కాకపోతే అందులో స్పెషలైజేషన్ సబ్జెక్టులకు సంబంధించిన ప్రశ్నలు కూడా అదనంగా ఉంటాయి.
ఆఫీసర్ స్కేల్– - I, II, III పోస్టులకు ఇంటర్వ్యూ ఉంటుంది. ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులకు రాత పరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
