జ్యోతిష్యం: సెప్టెంబర్.. గ్రహాలు మార్పు.. మేషరాశి ఉద్యోగస్తులకు కీలక బాధ్యతలు.. వ్యాపారంలో లాభాల మూట..!

జ్యోతిష్యం: సెప్టెంబర్.. గ్రహాలు మార్పు.. మేషరాశి ఉద్యోగస్తులకు కీలక బాధ్యతలు.. వ్యాపారంలో లాభాల మూట..!

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం 2026 సెప్టెంబర్​ నెలలో కీలక గ్రహాలు స్థానాలు మారబోతున్నాయి.  దీని ప్రభావం అన్ని రాశులపై ఉంటుందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.    ఈ నెలలోమేష రాశి వారి జీవితంలో  అనేక శుభ పరిణామాలు చోటు చేసుకొనే అవకాశాలున్నాయి. శని మీన రాశిలో వక్రగతిలో, రాహువు కుంభంలో, కేతువు సింహ రాశిలో సంచరిస్తున్నారు.  గ్రహాల సంచారం.. జ్యోతిష్య పండితులు తెలిపిన వివరాల ప్రకారంగా ఈ నెలలో  మేషరాశి వారికి ఎలా ఉంటుందో తెలుసుకుందాం. . .! 

సెప్టెంబర్​ లో స్థానాలు మారుతున్న గ్రహాలు

  • సెప్టెంబర్ 2:   తులా రాశిలోకి శుక్రుడు
  •  సెప్టెంబర్ 7: కన్యారాశిలోకి బుధుడు 
  •  సెప్టెంబర్ 17:   కన్యారాశిలోకి  సూర్యుడు
  •  సెప్టెంబర్ 18:  కర్కాటక రాశిలోకి కుజుడు 
  •  సెప్టెంబర్ 26: తులా రాశిలోకి  బుధుడు 

మేష రాశి వారికి 2026 సెప్టెంబర్​ నెలలో కొన్ని కీలక మార్పులు చోట చేసుకొనే అవకాశం ఉంది.   కొత్త వ్యక్తుల పరిచయాల వలన  ఆర్థికంగా కలిసి రావచ్చని జ్యోతిష్య అంచనాలు చెబుతున్నాయి. 
పెండింగ్​ బకాయిలు వసూలవుతాయి. విద్యార్థులకు కూడా ఈ కాలం అనుకూలంగా ఉండొచ్చు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. 

ఉద్యోగంలో ఒత్తిడి పెరిగినప్పటికీ మీ ప్రతిభతో సవాళ్లను అధిగమిస్తారు. అధికారులతో మాట్లాడేటప్పుడు సహనం వహించడం మంచిది. ఆదాయం స్థిరంగా ఉంటుంది.   ఉద్యోగంలో ప్రత్యేక బాధ్యతలు పెరుగుతాయి. అధికారుల నుంచి ప్రోత్సాహకాలు లభిస్తాయి . వృత్తి, వ్యాపారాల్లో మంచి మార్పులు చేపట్టి లబ్ధి పొందుతారు.  

ఈ రాశి  వారికి ఈ నెలలో  అపార ధన లాభం కనిపిస్తోంది. అనేక విధాలుగా ఆదాయం పెరుగుతుంది. ఆకస్మిక ధన ప్రాప్తి సూచనలున్నాయి. ఆదాయ, ఆరోగ్య సమస్యలేవీ ఉండకపోవచ్చు. దూర ప్రాంతం నుంచి పిల్లలు ఇంటికి వచ్చే అవకాశం ఉంది. వ్యక్తి గత, ఆర్థిక సమస్యల పరిష్కారం మీద దృష్టిసారిస్తారు. ముఖ్యమైన వ్యవహారాల్లో జీవిత భాగస్వామి సలహాలు కూడా తీసుకోవడం మంచిది. ఆస్తి వివాదాన్ని పెద్దల తోడ్పాటుతో పరిష్కరించుకుంటారు. ఉద్యోగరీత్యా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. కొందరు మిత్రుల వల్ల మోసపోయే అవకాశం ఉంది. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి. రావాల్సిన సొమ్ము సకాలంలో చేతికి అందుతుంది. కుటుంబంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. తల్లితండ్రుల తోడ్పాటు లభిస్తుంది.

ఈ నెలలో తలపెట్టిన పనుల్ని సంతృప్తి కరంగా పూర్తి చేస్తారు. పెళ్లి ప్రయత్నాల్లో సానుకూల స్పందన లభిస్తుంది. నిరుద్యోగులకు మంచి ఆఫర్లు అందుతాయి. వ్యక్తిగత సమస్య పరిష్కారం అవుతుంది. ఆరోగ్యం పరవాలేదు. విద్యార్థులు తేలికగా విజయాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు ఉత్సాహంగా, ఉల్లాసంగా సాగిపోతాయి.

పరిహారాలు : నిత్యం ఆదిత్య హృదయం పఠిచడం, ప్రతి సోమవారం పరమేశ్వరునికి రుద్రాభిషేకం

Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని జ్యోతిష్య నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించరు. మీకున్న  జ్యోతిష్య సమస్యలకు నిపుణులను సంప్రదించటం ఉత్తమం.