హైదరాబాద్ లో యువతి హల్‌చల్.. రన్నింగ్ కారుపై కూర్చొని బీర్ తాగుతూ రచ్చ

హైదరాబాద్ లో  యువతి హల్‌చల్.. రన్నింగ్ కారుపై కూర్చొని బీర్ తాగుతూ రచ్చ

రంగారెడ్డి జిల్లా:  నడిరోడ్డుపై ఓ యువతి చేసిన వింత చేష్టలు ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. రంగారెడ్డి జిల్లా తుర్కయాంజల్‌లో కదులుతున్న కారుపై కూర్చొని ఓ యువతి బీర్ తాగినట్లు చూపిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. యువతి తీరుపై నెటిజన్లతో పాటు వాహనదారులు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

తుర్కయాంజల్ ప్రాంతంలో ఓ యువతి కదులుతున్న కారుపై కూర్చొని బీర్ తాగుతున్న దృశ్యాలు వీడియోలో కనిపిస్తున్నాయి. రోడ్డుపై వాహనాలు రాకపోకలు సాగిస్తున్న సమయంలో ఇలాంటి చర్యలకు పాల్పడటం ప్రమాదకరమని పలువురు అభిప్రాయపడుతున్నారు.ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో యువతి ప్రవర్తనపై నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. రోడ్లపై ఇలాంటి ప్రమాదకర విన్యాసాలు చేయడం సరికాదని, సరదా కోసం ఇతరుల ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టకూడదని వ్యాఖ్యానిస్తున్నారు. రహదారులపై బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచిస్తున్నారు.

బహిరంగ రహదారులపై ఇలాంటి ప్రమాదకర చర్యలకు పాల్పడేవారిపై అధికారులు దృష్టి సారించాలని పలువురు కోరుతున్నారు. అయితే, ఈ ఘటనకు సంబంధించి పోలీసుల స్పందన, యువతిపై ఏవైనా చర్యలు తీసుకున్నారా అనే వివరాలు అధికారికంగా వెల్లడికావాల్సి ఉంది.