హైదరాబాద్, వెలుగు: రిజర్వేషన్ రోస్టర్‌ను సవరించి మాలలకు 20 లోపు రెండు పాయింట్లు కేటాయించాలని, జీవో నంబర్ 99ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ మాల మహానాడు నేతలు సోమవారం సెక్రటేరియెట్ ముట్టడికి యత్నించారు. దీంతో పోలీసులు అడ్డుకోగా ఉద్రిక్తత నెలకొంది. మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు పిల్లి సుధాకర్ మాట్లాడుతూ రిజర్వేషన్ రోస్టర్ విధానాన్ని సవరించాలని, జీవో 99ను రద్దు చేసి మాల గ్రూప్-3లోని 26 కులాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
