కొత్త నెలలో బంగారం రివర్స్ గేర్.. కేజీకి రూ.5వేలు తగ్గిన వెండి: హైదరాబాద్ రేట్లివే!

కొత్త నెలలో బంగారం రివర్స్ గేర్.. కేజీకి రూ.5వేలు తగ్గిన వెండి: హైదరాబాద్ రేట్లివే!

గడచిన కొన్ని రోజులుగా ఊహించని రీతిలో పడిపోతున్న బంగారం రేట్లు మళ్లీ మంగళవారం తిరిగి పెరగటం స్టార్ట్ చేశాయి. అమెరికా ఇరాన్ మధ్య యుద్ధ మేఘాలతో పాటు అంతర్జాతీయంగా మారుతున్న ఆర్థిక అంశాలు కూడా బులియన్ మార్కెట్ల గమనాన్ని మార్చేస్తున్నట్లు నిపుణులు అంటున్నారు. శ్రావణమాసం చివరికి వస్తున్న వేళ రిటైల్ ఆభరణాలు షాపింగ్ చేద్దాం అనుకుంటున్న వ్యక్తులు ముందుగా తమ నగరాల్లో కొత్త రేట్లను పరిశీలించటం బెటర్. 

సెప్టెంబర్ 1న బంగారం రేట్లు పెరిగాయి. ఆగస్టు 31 కంటే గ్రాముకు 24 క్యారెట్ల బంగారం రేటు దేశవ్యాప్తంగా రూ.16 పెరిగింది. దీంతో హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడప నగరాల్లో స్వచ్చమైన బంగారం రేటు రూ.15వేల 693గా కొనసాగుతోంది. ఈ నగరాల్లో 22 క్యారెట్ల బంగారం రేటు గ్రాముకు రూ.14వేల 385గా కొనసాగుతోంది. 

మంగళవారం రోజున వెండి రేట్ల విషయానికి వస్తే.. సెప్టెంబర్1, 2026న దేశవ్యాప్తంగా కేజీకి రూ.5వేలు తగ్గింది. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడపలో కేజీ స్వచ్ఛమైన వెండి రేటు కేజీ రూ.5వేలు తగ్గి రూ.2లక్షల 55వేలుగా ఉంది. అంటే గ్రాము దాదాపు రూ.255 దగ్గర ఉంది.