న్యూఢిల్లీ: ఇండియా టేబుల్ టెన్నిస్ ప్లేయర్ అంకుర్ భట్టాచార్జీ.. డబ్ల్యూటీటీ ఫీడర్ ఒలోమౌక్ టోర్నీలో రెండు మెడల్స్‌తో మెరిశాడు. మెన్స్ సింగిల్స్ టైటిల్‌తో పాటు డబుల్స్‌లోనూ గోల్డ్ మెడల్‌ను సొంతం చేసుకున్నాడు.
చెక్ రిపబ్లిక్ వేదికగా సోమవారం ముగిసిన ఈ టోర్నీలో మెన్స్ సింగిల్స్ ఫైనల్లో అంకుర్ 3–1 (9–11, 11–4, 11–5, 11–6)తో డెని కోజుల్ (స్లొవేనియా)పై గెలిచాడు. అంకుర్ కెరీర్‌లో ఇది తొలి డబ్ల్యూటీటీ టైటిల్ కావడం విశేషం. మెన్స్ డబుల్స్‌లో అంకుర్–ఆకాశ్ పాల్ 3–1 (11–8, 4–11, 13–11, 11–9)తో కసా అండ్రాస్ (హంగేరి)–అలాన్ కుల్చికి (పోలెండ్)పై నెగ్గారు.
