హైదరాబాద్, వెలుగు: ఏషియన్ షార్ట్ ట్రాక్ చాంపియన్‌షిప్–2026 పతకాలు సాధించిన తెలంగాణ షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటర్ ప్రణవ్ మాధవ్ సూరపనేనిని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ (శాట్స్) అధికారులు అభినందించారు. సోమవారం శాట్స్ కార్యాలయంలో చైర్మన్ శివసేనా రెడ్డి, వైస్ చైర్మన్ సోనిబాల దేవిని మర్యాదపూర్వకంగా కలిశాడు.
ఇటీవల జరిగిన ఏషియన్ చాంపియన్‌షిప్‌లో ప్రణవ్ ఒక సిల్వర్, రెండు బ్రాంజ్ మెడల్స్ గెలిచాడు. జాతీయ చాంపియన్‌షిప్స్‌లో స్వర్ణాలు సాధించిన ప్రణవ్.. సీనియర్ వరల్డ్ టూర్‌కు అర్హత సాధించిన ఇండియన్ స్కేటర్లలో ఒకడిగా నిలిచాడు. 2030 ఒలింపిక్స్‌లో ఇండియాకు ప్రాతినిధ్యం వహించడమే తన ప్రధాన లక్ష్యమని ప్రణవ్ వెల్లడించాడు.
