బెంగళూరు: నార్త్ జోన్‌తో జరుగుతున్న దులీప్ ట్రోఫీ సెమీఫైనల్లో సౌత్ జోన్ కెప్టెన్ తిలక్ వర్మ (225 బాల్స్‌లో 7 ఫోర్లతో 106 బ్యాటింగ్) సెంచరీతో చెలరేగాడు. దాంతో 40/2 ఓవర్‌నైట్ స్కోరుతో సోమవారం రెండో రోజు ఆట కొనసాగించిన సౌత్ జోన్ రెండో ఇన్నింగ్స్‌లో 94 ఓవర్లలో 285/9 స్కోరు చేసింది.
ఆట ముగిసే టైమ్‌కు తిలక్‌తో పాటు కావూరి సాయితేజ (0 బ్యాటింగ్) క్రీజులో ఉన్నాడు. 80 రన్స్‌కే ఐదు వికెట్లు కోల్పోయిన దశలో తిలక్, శ్రేయస్ గోపాల్ (87) ఆరో వికెట్‌కు 175 రన్స్ జత చేసి ఇన్నింగ్స్‌ను ఆదుకున్నారు. ఓవరాల్‌గా 90 రన్స్ ఆధిక్యంలో కొనసాగుతోంది.
సెంట్రల్ 45/3
ఈస్ట్ జోన్‌తో జరుగుతున్న మరో సెమీస్‌లో సెంట్రల్ జోన్ కష్టాల్లో పడింది. రెండో రోజు ఆట ముగిసే టైమ్‌కు సెంట్రల్ రెండో ఇన్నింగ్స్‌లో20 ఓవర్లలో 45/3 స్కోరు చేసింది. అమన్ మోఖడే (23 బ్యాటింగ్), ఆర్యన్ పాండే (4 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. తొలి రోజు సెంట్రల్ జోన్ తొలి ఇన్నింగ్స్‌లో 266 రన్స్‌కు ఆలౌటైంది. రింకూ సింగ్ (60) టాప్ స్కోరర్. తర్వాత ఈస్ట్ జోన్ తొలి ఇన్నింగ్స్‌లో 266 రన్స్‌కే ఆలౌటైంది. వైభవ్ సూర్యవంశీ (92) సెంచరీ మిస్ చేసుకున్నాడు.
