హైదరాబాద్, వెలుగు: పీఆర్, ఆర్‌డీ కమిషనరేట్ కార్యాలయ అదనపు కమిషనర్ పి. రవీందర్‌కు ఎంప్లాయ్‌మెంట్ గ్యారంటీ మార్కెటింగ్ మిషన్ (ఈజీఎంఎం) చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా పూర్తి అదనపు బాధ్యతలను (ఎఫ్‌ఏసీ) ప్రభుత్వం అప్పగించింది. ఈ మేరకు పీఆర్, ఆర్‌డీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం. దాన కిశోర్ సోమవారం ఉత్తర్వులు జారీచేశారు. కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలోని డీడీయూ-డీడీకే కార్యక్రమం రాష్ట్రంలో ఈజీఎంఎం ద్వారా అమలవుతోంది.
