రాహుల్ గాంధీపై అక్రమ కేసును తొలగించాలి..పలు చోట్ల కాంగ్రెస్నేతల ఆందోళన

 రాహుల్ గాంధీపై అక్రమ కేసును తొలగించాలి..పలు చోట్ల కాంగ్రెస్నేతల ఆందోళన

గోదావరిఖని/చెన్నూరు/బెల్లంపల్లి, వెలుగు: కాంగ్రెస్​అగ్రనేత రాహుల్ ​గాంధీపై అక్రమంగా నమోదు చేసిన ఎఫ్​ఐఆర్​ను తొలగించాలని డిమాండ్​ చేస్తూ సోమవారం సాయంత్రం పెద్దపల్లి జిల్లా గోదావరిఖని చౌరస్తాలో ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా ప్లకార్డులు పట్టుకొని నల్ల బ్యాడ్జీలతో కాంగ్రెస్ శ్రేణులు నిరసన తెలిపారు. ఆల్​ఇండియా కాంగ్రెస్ ప్రెసిడెంట్​ఖర్గే పట్ల అత్యంత హేయంగా ప్రవర్తించిన బీజేపీ తీరును నిలదీస్తూ పార్లమెంట్​సాక్షిగా గొంతెత్తిన రాహూల్​గాంధీపై ఎఫ్ఐఆర్ నమోదు చేయడం దారుణమన్నారు. కుల, మత వివక్షను చూపుతున్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వెంటనే గద్దె దిగాలని డిమాండ్​చేశారు. కార్పొరేటర్లు, కాంగ్రెస్​నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మంచిర్యాల జిల్లా చెన్నూరులోని అంబేద్కర్ చౌక్ లో కాంగ్రెస్​నాయకులు రాస్తారోకో నిర్వహించి, నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు. రాహుల్ గాంధీపై అన్యాయంగా ఎఫ్ఐఆర్‌‌‌‌  నమోదు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. 

రాహూల్​ గాంధీపై ఎఫ్​ఐఆర్​ ఉపసంహరించాలి

లోక్​సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీపై కక్షపూరితంగా నమోదు చేసిన ఎఫ్‌‌‌‌ఐఆర్‌‌‌‌ను వెంటనే ఉపసంహరించాలని బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ డిమాండ్​ చేశారు. సోమవారం రాత్రి బెల్లంపల్లి కాంటా చౌరస్తాలో కాంగ్రెస్​ ఆధ్వర్యంలో చేపట్టిన నిరసనలో ఆయన పాల్గొని మాట్లాడారు. అణగారిన వర్గాలు, పేదలు, బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం, సామాజిక న్యాయం కోసం, రాజ్యాంగ పరిరక్షణ కోసం రాహుల్ గాంధీపై తప్పుడు కేసులు పెట్టడం సరికాదన్నారు. బెల్లంపల్లి పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు ప్రభాకర్ యాదవ్, మున్సిపల్ చైర్​పర్సన్ దావ స్వాతి తదితరులు పాల్గొన్నారు.