- ఫీచర్ ఫోన్లలో యూపీఐ సేవలు
- ఫోన్‌పే యూపీఐ 123పే ప్రారంభం
న్యూఢిల్లీ: ఫిన్‌టెక్ కంపెనీ ఫోన్‌పే ఇంటర్నెట్ అవసరం లేకుండానే ఫీచర్ ఫోన్ (కీప్యాడ్ ఫోన్) యూజర్లు డిజిటల్ లావాదేవీలు చేసుకునేలా 'ఫోన్‌పే యూపీఐ 123పే' సేవలను ప్రారంభించింది. దేశవ్యాప్తంగా ఉన్న దాదాపు 20 కోట్ల మంది ఫీచర్ ఫోన్ వినియోగదారులకు యూపీఐ సేవలను అందుబాటులోకి తెచ్చిన తొలి థర్డ్-పార్టీ యాప్ ప్రొవైడర్‌గా అవతరించినట్లు సంస్థ పేర్కొంది. కేవలం 2జీ నెట్‌వర్క్ ఉన్న ప్రాంతాల్లోనూ పని చేసేలా ఎస్ఎమ్ఎస్ ఆధారిత టెక్నాలజీతో దీనిని రూపొందించామని ప్రకటించింది.
