వేములవాడ, వెలుగు : సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి అనుబంధ ఆలయమైన భీమేశ్వర స్వామి వారి లడ్డూ ప్రసాదంలో పురుగు కనిపించింది. సిరిసిల్ల పట్టణానికి చెందిన సంతోష్ సోమవారం కుటుంబసభ్యులతో వేములవాడ వచ్చ భీమేశ్వర స్వామిని దర్శించుకున్నాడు. అనంతరం లడ్డూ ప్రసాదం కొనుగోలు చేసి తింటుండగా.. అందులో పురుగు కనిపించడంతో ఆలయ ఆఫీసర్లకు ఫిర్యాదు చేశారు. భక్తులు ఎంతో పవిత్రంగా భావించే లడ్డూ ప్రసాదం పరిశుభ్ర వాతావరణంలో తయారు చేయాలని, నాణ్యత పాటించాలని భక్తులు కోరుతున్నారు. లడ్డూ ప్రసాదంలో పురుగు కనిపించిన విషయంపై డిప్యూటీ ఈఓ ప్రతాప నవీన్ ను సంప్రదించగా.. అలాంటి అవకాశం లేదని చెప్పారు. అయినా ఘటనపై పూర్తిస్థాయిలో ఎంక్వైరీ చేస్తామన్నారు.
