కామారెడ్డి, వెలుగు: నకిలీ కరెన్సీని చలామణి చేస్తున్న మహారాష్ట్ర ముఠాను కామారెడ్డి పోలీసులు అరెస్ట్ చేశారు. కేసు వివరాలను బాన్సువాడ డీఎస్పీ విఠల్‌రెడ్డి శుక్రవారం మీడియాకు వెల్లడించారు. మహారాష్ట్రలోని పర్భణీకి చెందిన రాహెల్‌రావు సాహెబ్, ప్రతీక్ధ్యానోబా, డాల్వే, భీమ్శంకర్రాంరావ్ ఈ నెల 26న కారులో పిట్లం వచ్చారు. ఓ పెట్రోల్‌బంక్‌లో రూ.2 వేల పెట్రోల్ పోయించుకొని రూ.500 నోట్లు ఇచ్చి వెళ్లిపోయారు.
ఆ నోట్లు నకిలీవని గుర్తించిన బంక్ క్యాషియర్కారును ఆపే ప్రయత్నం చేసినా వారు ఆపకుండా పారిపోయారు. దీంతో బంక్ నిర్వాహకులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు ధర్మారం టోల్‌ప్లాజా వద్ద కారును గుర్తించి అందులో ఉన్న ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.91 వేల విలువైన నకిలీ నోట్లను స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ తెలిపారు.
