అమెరికాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు తెలంగాణ యువకులు చనిపోయారు. అమెరికాలోని ఫ్లోరిడాలో ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. మృతులలో ఒకరిని నిజామాబాద్ జిల్లా నవీపేటకు చెందిన రాహుల్ గా గుర్తించారు. రాహుల్ పై చదువులకోసం మూడు నెలల క్రితమే అమెరికాకు వెళ్లారు. రాహుల్ ఆకస్మిక మృతితో నవీపేటలో విషాద ఛాయలు నెలకొన్నాయి. రాహుల్ మరణ వార్త విన్న అతని తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు బోరున విలపించారు.
మంగళవారం (ఆగస్టు 25) రాహుల్ తోపాటు మరో ఇద్దరు ప్రయాణిస్తున్న కారు .. ఫ్లోరిడాలోని బ్రెవార్డ్ కౌంటీలో ఇంటర్‌స్టేట్ 95 హైవేపై ఓ చెట్టును ఢీకొన్నట్లు తెలుస్తోంది. ఉద్యోగరీత్యాల ఆ ముగ్గురు ఆఫీసులకు కారులో ప్రయాణిస్తున్నారు. డ్రైవర్ సీటులో ఉన్న రాహుల్ కు తీవ్ర గాయాలు కాగా చికిత్స కోసం ఆస్పత్రికి తరలించగా నిన్న రాత్రి మృతిచెందినట్లు సమాచారం. రాహుల్ ఎంఎస్ పూర్తి చేసి సౌత్ ఫ్లోరిడా యూనివర్సిటీలో పీహెచ్ డీ చేశాడని అతని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ప్రస్తుతం ఉద్యోగం కోసం వెతుకుతున్నట్లు చెప్పారు.
మృతిచెందిన మరో ఇద్దరు తెలంగాణ యువకుల వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. వారి స్వస్థలాలు, విద్యాసంస్థలకు సంబంధించిన మరిన్ని వివరాలు గుర్తించాల్సి ఉంది.
