హైదరాబాద్ సిటీలో నిషేధిత మందులు విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. నిషేధిత మందుల విక్రయాలకు అడ్డుకట్టవేసేందుకు పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేపడుతున్నారు. బుధవారం(ఆగస్టు26) మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మెడికల్ షాపులపై, మీయాపూర్ పోలీసులు, కూకట్ పల్లి ఎస్వోటీ పోలీసులు సంయుక్తంగా దాడులు చేశారు. భారీగా నిషేధిత పెయిన్ కిల్లర్ మెడిసిన్ అమ్ముతున్నట్టు గుర్తించారు.
మియాపూర్ లోని బాలాజీ మెడిక్ షాపును తనిఖీ చేసిన పోలీసులు.. పెద్ద ఎత్తున్న నిషేధిత మందులను అమ్ముతున్నట్లు గుర్తించారు. పెయిన్ కిల్లర్ గా వినియోగించే దాదాపు 15 వేల నిషేధిత ట్రాడ్ మోల్ టాబ్లెట్లను సీజ్ చేశారు. మెడికల్ షాపు నిర్వాహకుడు మహేశ్వర్ రెడ్డిపై కేసు నమోదు చేశారు.
