జ్యోతిష్యం: రాశి ప్రకారం రాఖీ బహుమానం.. 12 రాశుల్లో ఎవరికి ఏది బెస్ట్ గిఫ్ట్

 జ్యోతిష్యం:   రాశి ప్రకారం రాఖీ బహుమానం.. 12 రాశుల్లో  ఎవరికి ఏది బెస్ట్ గిఫ్ట్

రాఖీ పండుగ వచ్చేస్తోంది.  ఆ రోజు (ఆగస్టు 28) అక్కా చెల్లెళ్లు.. అన్న దమ్ములకు రాఖీ కడతారు.  ఆ సమయంలో నీకు నేను భరోసా అని  చెప్పిన సోదరులు  బహుమానాలు  ఇస్తారు.  ఈ ఏడాది రాఖీ పండగకు చాలా విశిష్ట కూడా ఉంది.  జ్యోతిష్య నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం మీ అక్క చెల్లెళ్ల రాశి ప్రకారం ఎవరికి ఎలాంటి గిఫ్ట్​ ఇవ్వాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం. . . 

మేష రాశి :  ఎరుపు రంగు దుస్తులు, ట్రావెల్ బ్యాగ్ , స్పోర్ట్స్ షూస్,  ఫిట్‌నెస్ స్మార్ట్‌వాచ్‌ బహుమతిగా ఇస్తే వారిలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది 

వృషభ రాశి : ఈ రాశి వారికి   మంచి పెర్ఫ్యూమ్, వాలెట్, వాచ్, హ్యాండ్‌బ్యాగ్ , ప్రీమియం చాక్లెట్లు, వెండి ఆభరణాలు, నాణేలు, తెల్లని పట్టు వస్త్రాలు ఇవ్వడం చాలా మంచిదని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.

మిథున రాశి : వీరికి  మంచి పుస్తకాలు, హెడ్‌ఫోన్స్, డైరీ, గ్యాడ్జెట్స్  వంటివి ఇవ్వడం వలన మనసుకు ఆనందం కలుగుతుంది

కర్కాటక రాశి  : ఈ రాశి వారికి ఫ్యామిలీ ఫోటో ఫ్రేమ్, వ్యక్తిగతంగా కస్టమైజేషన్ చేసిన బహుమతులు ఇస్తే బాగా ఇష్టపడతారు. వెండితో తయారు చేసిన వస్తువులను కూడా ఈ రాశి వారు బాగా ఇష్టపడతారు.

సింహ రాశి : వీరికి  స్టైలిష్‌గా ఉండే వాచ్, సన్‌గ్లాసెస్, బ్రాండెడ్ పెర్ఫ్యూమ్స్ ,  జువెలరీ వంటివి  రాఖీ పండుగ రోజు బహుమతిగా ఇవ్వడం వలన కెరీర్​ లో ఎదురయ్యే అడ్డంకులు తొలగుతాయి. 

కన్యా రాశి : ఈ రాశి  వారికి ఆర్గనైజర్, ప్లానర్, బ్యాగ్, పుస్తకాలు అంటే చాలా ఇష్టంగా ఉంటారు.

తులా రాశి : ఈ రాశి వారికి  జువెలరీ, ఫ్యాషన్ వాచ్, హోమ్ డెకరేషన్​ వంటి  వస్తువులు ఇస్తే చాలా సంతోషిస్తారు.

వృశ్చిక రాశి : వీరికి  లెదర్ వాలెట్, పుస్తకాలను రాఖీ గిఫ్ట్​ గా ఇవ్వాలి. పుస్తకాలంటే దేవుడి పుస్తకాలు.. ఇంకా దేవుడి చిత్ర పటాలు.. పూజా సామాగ్రి వంటివి ఇవ్వడం వలన జీవితంలో ఉన్నత స్థితికి చేరుకుంటారు. 

►ALSO READ | జ్యోతిష్యం : రాఖీ పౌర్ణమి రోజునే.. 7 గ్రహాలు..నక్షత్రాలు కలుస్తున్నాయా.. దీని వల్ల నష్టమా.. లాభమా.. !

ధనుస్సు రాశి : ఈ రాశి వారికి ట్రావెల్ బ్యాక్‌ప్యాక్, కెమెరా , ట్రావెల్ యాక్సెసరీస్, సెల్​ ఫోన్  వంటివి  నచ్చుతాయి.

మకర రాశి : వీరికి దీర్ఘకాలం ఉపయోగపడే స్టైలిష్ వాచ్‌లు,   ఆఫీస్ బ్యాగ్, వాలెట్, లెదర్ గిఫ్ట్స్ ఇవ్వచ్చు.

కుంభ రాశి : ఈ రాశికి చెందిన మహిళలు  స్మార్ట్ గ్యాడ్జెట్స్, స్మార్ట్ లైట్ బహుమతులు,ట్రెండీ గ్యాజెట్స్, మోడ్రన్ ఆర్ట్, లేటెస్ట్​ డ్రస్ లు, ఇంకా అలంకారానికి ఉపయోగించే వస్తువులంటే చాలా ఇష్టపడతారు.

మీన రాశి : వీరు  పెయింట్​ బొమ్మలు,  పుస్తకాలు, ఫోటో ఫ్రేమ్స్ , హ్యాండ్‌మేడ్ గిఫ్ట్స్‌ను  చూసి ఆనందిస్తారు

Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని జ్యోతిష్య నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించరు. మీకున్న  జ్యోతిష్య సమస్యలకు నిపుణులను సంప్రదించటం ఉత్తమం.