హైదరాబాద్లో రాత్రి బస్సు సర్వీసులు.. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు.. రూట్ల వివరాలు ఇవే!

హైదరాబాద్లో రాత్రి బస్సు సర్వీసులు.. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు.. రూట్ల వివరాలు ఇవే!

హైదరాబాద్​సిటీ, వెలుగు: గ్రేటర్​పరిధిలో బస్సు ప్రయాణికుల సంఖ్యపెరుగుతున్న నేపథ్యంలో రాత్రి సమయాల్లోనూ కొన్ని రూట్లలో బస్సులను నడపాలని ఆర్టీసీ అధికారులు నిర్ణయించారు. రాత్రి 10 తర్వాత కొన్ని కీలక దారుల్లో బస్సులు ఉండటం లేదని వస్తున్న ఫిర్యాదులే ఇందుకు కారణం.  

రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు నడిపేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 29 నుంచే అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తున్నారు. 

  • ప్రధాన రూట్లు, బస్సుల నంబర్లు ఇవే..
  •     సికింద్రాబాద్–హైటెక్ సిటీ–కొండాపూర్: 10హెచ్​నంబర్​ బస్సులు
  •     బాచుపల్లి –- వేవ్‌‌రాక్: 195డబ్ల్యూ బస్సులు సేవలందించనున్నాయి.
  •     సికింద్రాబాద్ –- హయత్‌‌నగర్: 290యు బస్సులు సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ సమీపం నుంచి అందుబాటులో ఉండనున్నాయి.
  •     సికింద్రాబాద్– -పటాన్‌‌చెరు: 219 నంబర్​బస్సులు.
  •     కోఠి – -పటాన్‌‌చెరు: 218 బస్సులు.
  •     కోఠి –- పటాన్‌‌చెరు: 222ఏ సర్వీసులు.
  •     కొండాపూర్ –- సికింద్రాబాద్: 10హెచ్​బస్సులు నడవనున్నాయి.
  •     హయత్‌‌నగర్ –- జేబీఎస్: 290యు బస్సులు రాత్రి వేళల్లో తిరగనున్నాయి.