- కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి జేరిపోతుల పరుశురాం వినతి
న్యూఢిల్లీ, వెలుగు: ఆర్బీఐ స్థాపనకు స్ఫూర్తిప్రదాత అయిన డాక్టర్ బీ.ఆర్. అంబేద్కర్ ఫొటోను కరెన్సీ నోట్లపై ముద్రించేలా కేంద్ర ప్రభుత్వం చొరవ చూపాలని అంబేద్కర్ ఫొటో సాధన సమితి జాతీయ అధ్యక్షుడు డాక్టర్ జేరిపోతుల పరశురామ్ కోరారు. ఈ మేరకు మంగళవారం ఢిల్లీలో తెలంగాణ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య బృందంతో కలిసి ఆయన కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి, నేషనల్ ఎస్టీ కమిషన్ చైర్మన్ అంతర్ సింగ్ ఆర్యాను కలిసి వినతిపత్రం సమర్పించారు.
కరెన్సీ నోట్లపై అంబేద్కర్ చిత్రపటాన్ని ముద్రించాలనే డిమాండ్‌పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, నేషనల్ ఎస్టీ కమిషన్ చైర్మన్ అంతర్ సింగ్ ఆర్య సానుకూలంగా స్పందించారని పరశురామ్ మీడియాకు వెల్లడించారు.
