పెళ్లికి వెళ్లొచ్చేసరికి ఇల్లు గుల్ల.. హైదరాబాద్ లో 50 లక్షల రూపాయల బంగారం, వెండి చోరీ

పెళ్లికి వెళ్లొచ్చేసరికి ఇల్లు గుల్ల.. హైదరాబాద్ లో 50 లక్షల రూపాయల బంగారం, వెండి చోరీ

అల్వాల్, వెలుగు: ఓ కుటుంబం పెళ్లికి వెళ్లొచ్చేసరికి వారి ఇంట్లోని 24.5 తులాల బంగారు ఆభరణాలు, 2 కిలోల వెండి, రూ.10 వేలను దుండగులు చోరీ చేశారు. ఈ ఘటన అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.

మచ్చ బొల్లారంలోని బృందావన్ రైల్ నివాస్ కాలనీలో ఉంటున్న వి.సత్య రత్నాకర్ రావు ఆగస్టు 22న తన కుటుంబసభ్యులతో కలిసి మెట్​పల్లిలో బంధువుల పెళ్లికి వెళ్లారు.

24న అర్ధరాత్రి ఇంటికి చేరుకోగా.. తాళం పగులగొట్టి ఉంది. లోపలికి వెళ్లి చూడగా.. అల్మారాలోని ఆభరణాలు, వెండి, డబ్బులు కనిపించలేదు.

చోరీ జరిగిందని నిర్ధారించుకొని పోలీసులకు సమాచారం అందించగా.. సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. బాధిత కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.