మిలాద్- ఉన్ -నబీ.. పాతబస్తీలో ట్రాఫిక్ ఆంక్షలు

 మిలాద్- ఉన్ -నబీ.. పాతబస్తీలో ట్రాఫిక్ ఆంక్షలు

హైదరాబాద్ సిటీ, వెలుగు: మిలాద్- ఉన్ -నబీ సందర్భంగా బుధవారం నిర్వహించనున్న శాంతి ర్యాలీల దృష్ట్యా ఉదయం10 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు పాతబస్తీలో ట్రాఫిక్ ఆంక్షలు, మళ్లింపులు అమలులో ఉంటాయని ట్రాఫిక్ జాయింట్ సీపీ డి.జోయల్ డేవిస్ ప్రకటించారు.

ఫలక్‌‌‌‌నుమా, చార్మినార్, మక్కా మసీదు, వోల్టా హోటల్, పత్తర్‌‌‌‌గట్టి, నాంపల్లి హజ్ హౌస్ వైపు సాగే ప్రధాన మార్గాలతోపాటు, 28 ముఖ్యమైన జంక్షన్లలో ట్రాఫిక్‌‌‌‌ను ప్రత్యామ్నాయ మార్గాలకు మళ్లించనున్నట్లు పేర్కొన్నారు. అత్యవసర సహాయం కోసం ట్రాఫిక్ హెల్ప్‌‌‌‌లైన్ నంబర్ 90102 03626ను సంప్రదించాలని సూచించారు.