ప్రతిష్టాత్మకంగా యంగ్ ఇండియా స్కూళ్లు : జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్

ప్రతిష్టాత్మకంగా యంగ్ ఇండియా స్కూళ్లు : జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్

జగిత్యాల రూరల్, వెలుగు: యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేస్తోందని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అన్నారు. జగిత్యాల నియోజకవర్గంలో తాటిపల్లి శివారులో 25 ఎకరాల్లో రూ.200 కోట్లతో నిర్మించే యంగ్​ఇండియా స్కూల్ పనులను శుక్రవారం అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి ఎమ్మెల్యే పరిశీలించారు. 

ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పేద, మధ్యతరగతి కుటుంబాల విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు వసతి, భోజనం, క్రీడలు, నైపుణ్యాభివృద్ధి వంటి సౌకర్యాలను ఒకే ప్రాంగణంలో అందించడం ఈ స్కూళ్ల ప్రధాన ఉద్దేశ్యమన్నారు. 2500 మంది విద్యార్థులకు ప్రాథమిక స్థాయి నుంచే ఆధునిక విద్యా సదుపాయాలు అందించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో రూరల్ తహసీల్దార్​ హకీమ్, ఏఈలు శశి, ధనుంజయ్, ఏఎంసీ చైర్మన్ గడ్డం నారాయణ రెడ్డి, సర్పంచులు గంగారెడ్డి, రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.