జ్యోతిష్యం: పూర్వఫల్గుని నక్షత్రంలోకి బుధుడు.. ఐదు రాశుల వారికి ధనయోగం..అన్నింటా విజయం..

జ్యోతిష్యం:  పూర్వఫల్గుని నక్షత్రంలోకి బుధుడు.. ఐదు రాశుల వారికి ధనయోగం..అన్నింటా విజయం..

గ్రహాలు ఎప్పటికప్పుడు షెడ్యూల్​ ప్రకారం  స్థానాలు మారుతుంటాయి.  జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాలు.. నక్షత్రాలు.. రాశుల ఎప్పుడు ఎక్కడ ఉన్నాయి.  ఏ దిశలో సంచారం చేస్తున్నాయి . మొదలగు విషయాలను పరిశీలించి నిపుణులు వ్యక్తిగత జాతకాన్ని అంచనా వేస్తారు.  ఆగస్టు 29 వతేదీన మధ్యాహ్నం 12:58 గంటలకు బుధుడు ..  సింహ రాశిలోని పూర్వ ఫల్గుణి నక్షత్రంలోకి మారుతాడు. ఈ ప్రభావంతో ఐదు రాశుల వారికి అదృష్టయోగంతో పాటు ఆర్థికంగా పురోభివృద్ది ఉంటుందని పండితులు చెబుతున్నారు. ఇప్పుడు ఆ రాశుల గురించి తెలుసుకుందాం.. . .!

మేష రాశి  : పూర్వ ఫల్గుని నక్షత్రంలో బుధ సంచారం వలన ఈ రాశి వారికి చాలా శుభపరిణామాలు చోటు చేసుకుంటాయి.  వర్కింగ్​ ప్లేస్​లో లీడర్​ షిప్​ పాత్ర పోషించే అవకాశాలున్నాయి. ఉద్యోగస్తులకు తగిన గుర్తింపు లభిస్తుంది. ఉద్యోగం మారాలనుకునే వారికి చాలా శుభసమయని పండితులు చెబుతున్నారు.  కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడుతాయి. నిరుద్యోగులు గుడ్​ న్యూస్​వింటారు.  కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది.  ఆకస్మిక ధన ప్రాప్తికి బాగా అవకాశం ఉంది. ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవు.    ఆఫీసర్ల మద్దతు పుష్కలంగా ఉంటుంది. వ్యాపారస్తులకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు.    ఆస్తి వివాదం పరిష్కారమై విలువైన ఆస్తి చేతికి అందుతుంది. ఉద్యోగంలో జీతభత్యాలు, వృత్తి, వ్యాపారాల్లో లాభాలు వృద్ధి చెందుతాయి.అప్పుల సమస్యల నుంచి విముక్తి కలిగే అవకాశం ఉంది.  సొంతింటిని ఏర్పరచుకొనేందుకు ప్లాన్​ వేస్తారు. వృత్తి, ఉద్యోగాల్లో జీత భత్యాలు బాగా పెరుగుతాయి.సమాజంలో మంచి గౌరవం పెరుగుతుంది.పెళ్లి కోసం ఎదురు చూసే వారికి మంచి సంబంధం కుదురుతుందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. 

మిథున రాశి : బుధుడు పూర్వ ఫల్గుని నక్షత్రంలో సంచారం వలన ఈ రాశి వారికి అనుకోకుండా కొన్ని బాధ్యతలు వచ్చే అవకాశం ఉంది.  ఉన్నతాధికారుల సహకారంతో ముఖ్యమైన పనులను సజావుగా పూర్తి చేయడం సాధ్యమవుతుంది.  ధైర్యంతో నిర్ణయాలు తీసుకునే మీ లైఫ్​ టర్నింగ్​ పాయింట్​ అవుతుంది.  ఉద్యోగంలో జీతభత్యాలు, వృత్తి, వ్యాపారాల్లో లాభాలు వృద్ధి చెందుతాయి.అప్పుల సమస్యల నుంచి విముక్తి కలిగే అవకాశం ఉంది.  సొంతింటిని ఏర్పరచుకొనేందుకు ప్లాన్​ వేస్తారు.రాబోయే రోజుల్లో వృత్తిపరమైన పురోగతికి మంచి అవకాశాలను కల్పించవచ్చు. ఆకస్మిక ధన లాభాలు కలుగుతాయి.ఆస్తుల విలువ బాగా పెరుగుతుంది.   ఈ రాశి వారికి అన్ని విధాలుగా లాభదాయకంగా ఉంటుందని పండితులు చెబుతున్నారు.

సింహ రాశి: బుధుడు నక్షత్రం మార్పు వలన ఈ రాశి వారు శక్తి  సామర్థ్యాలు నిరూపించుకోవడానికి  మంచి సమయమని పండితులు చెబుతున్నారు.  జీవిత భాగస్వామికి  ఆకస్మిక ధన లాభం వస్తుంది. అనేక వైపుల నుంచి ఆదాయం వృద్ధి చెందుతుంది.వృత్తి పరంగా లైఫ్​ లో సక్సెస్​ సాధిస్తారు. కెరీర్​ లక్ష్యాలను సాధించడంలో సఫలీకృతులవుతారని పండితులు చెబుతున్నారు. అనుకోకుండా పూర్వీకుల ఆస్తి కలిసి వస్తుంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్​ తో పాటు జీతం పెరిగే అవకాశం ఉంది.  ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురు చూసే వారు గుడ్​ న్యూస్​ వింటారు.ప్రేమ విషయంలో శుభవార్త వింటారు. కష్టాల్లో ఉన్న పొరుగువారికి సహాయం చేయడం వల్ల మీ మనస్సుకు శాంతి లభిస్తుంది.ఇల్లు, భూములకు సంబంధించిన వివాదాలు, కుటుంబ సమస్యలు పరిష్కారమవుతాయని జ్యోతిష్య శాస్త్రం ద్వారా తెలుస్తుంది. 

తులా రాశి :  పూర్వ ఫల్గుని సంచారం వలనఈ రాశి వారు పట్టిందల్లా బంగారం అవుతుంది. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు అంచనాల్ని మించుతాయి. ఉద్యోగంలో జీతభత్యాలు రెట్టింపవుతాయి. ఆస్తి వివాదాలు అనుకూలంగా పరిష్కారమవుతాయి.  ఆర్థిక పరిస్థితి గతం కంటే బాగా మెరుగ్గా ఉంటుంది. .  ప్రభుత్వ ఉద్యోగం ఎదురు చూసే వారు గుడ్ న్యూస్ వింటారు.  మూడు గ్రహాల అనుకూల స్థితి వలన ఈ రాశి వారికి ఎప్పటి నుంచి పెండింగ్ లో ఉన్న పనులు పరిష్కారమవుతాయి. జాయింట్ వ్యాపారాలు కలసివస్తాయి.  ఇంట్లో శుభకార్యం జరిగే అవకాశం ఉంది. ఉద్యోగస్తులకు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ప్రమోషన్ లభిస్తుంది. పెళ్లి కోసం ఎదురు చూస్తున్న వారికి ఆశించిన సంబంధం కుదురుతుంది. చేతి వృత్తుల వారికి అధికంగా ఆర్డర్లు రావడంతో కష్టాలు తీరతాయని పండితులు చెబుతున్నారు. 

ధనుస్సు రాశి:  బుధుడు ... పూర్వ ఫల్గుని నక్షత్రంలో సంచారం వలన ఈ రాశి వారికి ఒత్తిడి తగ్గుతుంది. ఉద్యోగంలో ఉన్నత పదవులు లభించడానికి బాగా అవకాశం ఉందని పండితులు చెబుతున్నారు. ఏ చిన్న ప్రయత్నం తలపెట్టినాఅనుకోని విజయాలు లభించే అవకాశం ఉంది.  చేతి వృత్తుల వారికి అనుకోకుండాఆర్డర్లు  లభిస్తాయి.  ఉద్యోగం చేయాలన్న ఉద్యోగులు, నిరుద్యోగుల కల తప్పకుండా ఫలిస్తుంది. ఆస్తి వివాదాలు  అనుకూలంగా పరిష్కారం అవుతాయి.  ఆకస్మిక ధనలాభంతో పాటు  తక్కువ శ్రమ..ఎక్కువ లాభం పొందే అవకాశం ఉంది. తమ లక్ష్యాలను సాధించుకోవడానికి, తమ ఆశల్ని నెరవేర్చుకోవడానికి ఎంత ప్రయత్నిస్తే అంత మంచిదని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.  అనేక మార్గాల్లో ఆదాయం వృద్ధి చెందుతుంది. 

Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని జ్యోతిష్య నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించరు. మీకున్న  జ్యోతిష్య సమస్యలకు నిపుణులను సంప్రదించటం ఉత్తమం