దసరా స్పెషల్: చదువులో వెనుకబడి ఉన్నారా.. మూలా నక్షత్రం రోజు చేయాల్సిన పూజ ఇదే..!

దసరా స్పెషల్:  చదువులో వెనుకబడి ఉన్నారా..  మూలా నక్షత్రం రోజు చేయాల్సిన పూజ ఇదే..!

దసరా నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి.  నవరాత్రి ఉత్సవాల్లో ఆరవ రోజున ( అక్టోబర్​ 16)న​అమ్మవారు  సరస్వతి అమ్మవారి అవతారంలో భక్తులకు దర్శనమిస్తారు.   ఈరోజు మూలా నక్షత్రం ఉండటంతో చిన్నారులకు అక్షరాభ్యాసం చేయిస్తే చదువులో బాగా రాణిస్తారని పండితులుచెబుతున్నారు. 

నవరాత్రుల్లో మూల నక్షత్రంకు చాలా విశేషమైన స్థానం ఉందని చెప్తుంటారు. చదువుకు, జ్ఞానంకు అధిదేవత అయిన సరస్వతి అమ్మవారి జన్మతిథిగా చెప్తారు. అందుకే ఈ రోజున అమ్మవారిని యథా శక్తి కొలుచుకుంటే జీవితంలో అన్ని రకాల విద్యల్లో ఆరుతెరుతారని పండితులు సూచిస్తున్నారు.

దసరానవరాత్రి ఉత్సవాల్లో మూల నక్షత్రం రోజున అమ్మవారు సరస్వతి రూపంలో భక్తులను ఆశీర్వదిస్తారు.  ఈ ఏడాది ఆశ్వయుజమాసం దసరానవరాత్రి ఉత్సవాల్లో మూలా నక్షత్రం శుక్రవారం  రావడ చాలా విశేషమని పండితులు చెబుతున్నారు. 

అమ్మవారికి పూజ చేసేవారు ఎర్రటి వస్త్రాలు ధరించి పూజలో పాల్గొంటే చాలా మంచిది. పూజ మండపంలో  తమ పిల్లలకు పుస్తకాలు, పెన్నులను పూజలో ఉంచాలి. అదే విధంగా అక్షరాభ్యాసం మొదలైనవి చేయిస్తే విశేషంగా అమ్మవారి అనుగ్రహం కల్గుతుందని పండితులు చెబుతున్నారు.

సరస్వతి రూపంలో ఉన్న దుర్గమ్మ  అమ్మవారికి షోడషోపచారాలతో భక్తితో పూజించి..  చక్కెర పొంగలి, పులిహోర, పాయసం, సిర మొదలైనవి నైవేద్యంగా సమర్పించాలి. చదువులో వెనుకగా ఉంటే వారు ఈ రోజున అమ్మవారిని భక్తితో పూజించుకుని పలకలు లేదా పెన్నులు, నోట్ పుస్తకాలు దానం చేస్తే దోషం తొలగి బాగా రాణిస్తారని పురాణాలద్వారా తెలుస్తుంది.

ఇలా చేస్తే విద్యలో వస్తున్న ఆటంకాలు పోయి మంచి జ్ఞానం కల్గుతుందని పండితులు చెబుతున్నారు. సరస్వతి అమ్మవారిని అష్టోత్తర నామాలతో పాటు వివిధ స్తోత్రాలను భక్తితోపఠించి, పూజించాలి. రోజంతా ఉపవాసం  ఉండి సాయం కాలంలో లలిత సహస్రనామా పారాయణ, శతచండీ పారాయణ మొదలైనవి పఠిస్తే అమ్మవారి సంపూర్ణ అనుగ్రహం కల్గుతుందని పండితులు చెబుతున్నారు.

Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని  పురాణాల ప్రకారం పండితులు.. నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించరు. మీకున్న ఆధ్యాత్మిక నిపుణులను సంప్రదించటం ఉత్తమం.