రాఖీ పౌర్ణమి రోజున బంగారం, వెండి కొనాలనుకునే వారికి భారీ ఊరట లభించింది. దాదాపు 20 రోజులుగా ఊహించని విధంగా పెరుగుతూ ప్రజలను ఆందోళనకు గురిచేసిన బులియన్ మార్కెట్లు తిరిగి సామాన్యులకు అందుబాటులోకి వస్తున్నాయి. ఎవరైనా శ్రావణ శుక్రవారం కోసం షాపింగ్ చేయాలనుకుంటున్నట్లయితే ముందుగా తమ నగరాల్లోని రేట్లను పరిశీలించి షాపింగ్ పూర్తి చేయటం బెటర్.
ఆగస్టు 28న బంగారం రేట్లు భారీగా తగ్గాయి. ఆగస్టు 27 కంటే గ్రాముకు 24 క్యారెట్ల బంగారం రేటు దేశవ్యాప్తంగా రూ.316 తగ్గింది. దీంతో హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడప నగరాల్లో స్వచ్చమైన బంగారం రేటు రూ.15వేల 982గా కొనసాగుతోంది. ఈ నగరాల్లో 22 క్యారెట్ల బంగారం రేటు గ్రాముకు రూ.14వేల 650గా కొనసాగుతోంది.
శుక్రవారం రోజున వెండి రేట్ల విషయానికి వస్తే.. ఆగస్టు 28, 2026న దేశవ్యాప్తంగా కేజీకి రూ.5వేలు తగ్గింది. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడపలో కేజీ స్వచ్ఛమైన వెండి రేటు కేజీ రూ.5వేలు తగ్గి రూ.2లక్షల 60వేలుగా ఉంది. అంటే గ్రాము దాదాపు రూ.260 దగ్గర ఉంది.
