వేద జ్యోతిష్యం ప్రకారం 2026 సెప్టెంబర్ 18న ఒక అరుదైన గ్రహ కూటమి ఏర్పడబోతోంది. ఆ రోజు సాయంత్రం 4:35 గంటలకు కుజుడు (అంగారకుడు) కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు. అప్పటికే అక్కడ ఉన్న గురుడు (బృహస్పతి)తో కలిసి శక్తివంతమైన సంయోగాన్ని ఏర్పరుస్తాడు. ఈ అరుదైన కలయిక అక్టోబర్ 29న గురుడు సింహరాశిలోకి మారేంత వరకు ఉంటుంది.
ఈ రెండు గ్రహాల ప్రభావం వల్ల ముఖ్యంగా 4 రాశుల వారికి కెరీర్, ఆర్థికం, ఆస్తి వ్యవహారాల్లో అద్భుతమైన మార్పులు రాబోతున్నాయి. ఆ రాశుల వివరాలు ఇవే:
మేష రాశి: ఈ రాశి వారికి ఉద్యోగంలో శుభవార్తలు వినే అవకాశం ఉంది. వ్యాపారాలు విస్తరిస్తాయి. విదేశీ ప్రయాణాలు, కొత్త ప్రాజెక్టుల ద్వారా ఆర్థికంగా బాగా కలసివస్తుంది.
కర్కాటక రాశి: సొంత రాశిలోనే ఈ సంయోగం జరుగుతుండటంతో ఆర్థిక లాభాలు మెండుగా ఉంటాయి. ఉద్యోగులకు ప్రమోషన్లు, హోదాలు లభిస్తాయి. వ్యాపారులకు పెద్ద కాంట్రాక్టులు లేదా లాభదాయకమైన డీల్స్ కుదురుతాయి. పెండింగ్‌లో ఉన్న ఆస్తి పనులు పూర్తవుతాయి.
కన్యా రాశి: కన్యా రాశి వారికి కూడా ఈ గ్రహాల మార్పు వృత్తి, రాబడి పరంగా ఎంతో అనుకూలిస్తుంది. దీర్ఘకాలికంగా ఉన్న ఆర్థిక సమస్యలు తీరి, నిలకడైన ఆదాయం సమకూరే అవకాశాలు ఉన్నాయి.
తులా రాశి: కెరీర్‌లో ఊహించని పురోగతి ఉంటుంది. మీ కష్టానికి తగ్గ గుర్తింపుతో పాటు జీతం పెంపు, పదోన్నతి లభించే ఛాన్స్ ఉంది. ఊహించని ధన లాభాలు, కొత్త పెట్టుబడుల ద్వారా ఆస్తిని పెంచుకుంటారు.
Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని జ్యోతిష్య నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించరు. మీకున్న జ్యోతిష్య సమస్యలకు నిపుణులను సంప్రదించటం ఉత్తమం.
