హైదరాబాద్ లో వినాయక చవితికి ముందే 4 లక్షల మట్టి విగ్రహాల పంపిణీ

హైదరాబాద్ లో వినాయక చవితికి ముందే 4 లక్షల మట్టి విగ్రహాల పంపిణీ
  •    14న వినాయక చవితికి ముందే పంపిణీ 
  •     24న నిమజ్జనానికి ఏర్పాట్లు  
  •     బేబీ, ఎక్సకవేటెడ్ పాండ్స్, పోర్టబుల్ ట్యాంక్స్ ఏర్పాట్లపై కసరత్తు

హైదరాబాద్‌‌‌‌ సిటీ, వెలుగు: వచ్చే నెల14న వినాయక చవితి ఉండడంతో భక్తులకు 4 లక్షల మట్టి గణేశ్​విగ్రహాలను ఉచితంగా పంపిణీ చేసేందుకు మూడు కార్పొరేషన్ల అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. జీహెచ్ఎంసీ లక్ష, ఎంఎంసీ, సీఎంసీలు 50 వేల చొప్పు నేరుగా కొని ఇవ్వనుండగా, పీసీబీ, హెచ్ఎండీఏ ద్వారా జీహెచ్ఎంసీకి లక్ష, సీఎంసీ, ఎంఎంసీకి 50వేల చొప్పున విగ్రహాలు రానున్నాయి. ఇవన్నీ కలిపి 4లక్షల విగ్రహాలు పంపిణీ చేయనున్నారు. మూడు కేటగిరీల్లో 8 ఇంచ్ లు, ఫీట్, 1.5 ఫీట్ల ఎత్తులో విగ్రహాల సైజు ఉండనున్నది.   

20 లేక్స్ వద్ద భారీగా ఏర్పాట్లు..

వచ్చేనెల 24న నిమజ్జనాన్ని హుస్సేన్‌‌‌‌సాగర్‌‌‌‌ సహా సరూర్‌‌‌‌నగర్ చెరువు, ఐడీఎల్ చెరువు, సఫిల్ గూడ చెరువు, సున్నం చెరువుతో సహా మొత్తం 25 పెద్ద చెరువుల్లో నిమజ్జన నిర్వహించనున్నారు. పెద్ద విగ్రహాలను ప్రధాన చెరువుల్లో, చిన్న విగ్రహాలను బేబీ పాండ్స్‌‌‌‌, ఎక్సకవేటెడ్‌‌‌‌ పాండ్స్‌‌‌‌, పోర్టబుల్‌‌‌‌ ట్యాంకుల్లో నిమజ్జనం చేసేలా కసరత్తు చేస్తున్నారు.