ఆధ్యాత్మికం:పూజకు మందు మూడు చెంచాల నీటిని ఎందుకు తాగాలి..అలా చేయకపోతే ఫలితం ఉండదా..!

ఆధ్యాత్మికం:పూజకు మందు మూడు చెంచాల నీటిని ఎందుకు తాగాలి..అలా చేయకపోతే ఫలితం ఉండదా..!

హిందూ సంప్రదాయం ప్రకారం..  చాలామంది ఇళ్లల్లో రోజు పూజచేస్తారు.  షాపులు ఓపెనింగ్​లు.. ఇతర శుభకార్యాలు చేసేటప్పుడు కచ్చితంగా పూజతో ప్రారంభిస్తారు.  ఎక్కడ పూజ చేసినా.. ఎప్పుడు చేసినా ముందు కచ్చితంగా స్పూన్ల నీటిని చేతిలో పోసుకొని తాగుతారు.. నీరు తాగి పూజప్రారంభింకపోతే ఫలితం రాదా.. పండితులు ఏం చెబుతున్నారు.. ఈ విషయం గురించి పురాణాల్లో ఏముంది.. మొదలగు విషయాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం. . .!

హిందూ సంప్రదాయం ప్రకారం రోజూ పూజ చేయడం అనేది ఆచారం.  ఎవరు ఎంతసేపు చేసినా కచ్చితంగా పూజ ప్రారంభానికి ముందు మూడు సార్లు నీటిని తాగుతారు.  దీనినే ఆచమనం అంటారని పండితులు చెబుతున్నారు. ఇది కేవలం నీరు తాగే ఆచారమే కాదు.  దీని వెనుకు చాలా ఆధ్యాత్మిక భావనలు ఉన్నాయి. 

భగవంతుని ఆరాధించడానిక ముందు  పవిత్రంగా ఉండాలి.  శరీరం.. మనస్సు.. వాక్​ ఇవి పూజకు చాలా ముఖ్యం. పండితులు చెప్పిన వివరాల ప్రకారం పూజకు ముందు మూడు సార్లు కొన్ని ప్రత్యేకమైన మంత్రాలు చదువుతూ మూడు సార్లు తాగాలి. శాస్త్రాల ప్రకారం ఆచమనం  అనే ఈ ప్రక్రియతో శరీరం.. మనస్సు.. వాక్​ శుద్ది అవుతాయని పండితులు చెబుతున్నారు.   ఈ ప్రక్రియ ద్వారా భక్తుడు తన శరీరాన్ని మాత్రమే కాదు, తన మనస్సును కూడా ప్రశాంతంగా మార్చుకుని దైవారాధనకు సిద్ధమవుతాడని శాస్త్రాల ద్వారా తెలుస్తుంది. 

పూజ చేసేటప్పుడు ఇతర ఆలోచనలు రాకూడదు.  అలా ఉండాలంటే  శరీరం, మనస్సు, వాక్కు చాలా పవిత్రంగా ఉండాలి. ప్రస్తుతం జీవన విధానంలో  అనేక ఆలోచనలు.. పని ఒత్తిడి,, కోప.. ఆందోళనలు... ఇలా అనేక విషయాలతో మనస్సు ప్రభావితమవుతుంది. అందుకే ఆచమనం చేస్తే అలాంటి విషయాలను కొంతసేపు పక్కన పెట్టి మనస్సు .. దృష్టి.. భగవంతునిపై ఉంటుందని పండితులు చెబుతున్నారు. 

హిందూ సంప్రదాయాల ప్రకారం నీటికి చాలా పవిత్రత  ఉంది. అన్ని ధార్మిక కార్యక్రమాల్లో నీటికి ప్రత్యేక స్థానం ఉంది.  స్వామి వారికి అభిషేకం చేసేటప్పుడు  నీటిని ఉపయోగిస్తారు.  ఆచమనం అంటే మూడే సార్లు నీటిని చేతిలో పోసుకొని తాగడం.  దీనివలన శరీరం మానసికంగా పవిత్రత అవడమే కాకుండా.. మలినాలు కూడా తొలగుతాయని పండితులు చెబుతున్నారు. కోపం, అసూయ, ఆందోళన, ప్రతికూల ఆలోచనలు, అహంకారం వంటి అంతర్గత దోషాలను కూడా సూచిస్తుంది.

ఆచమనం మంత్రాల శబ్దాలకు మనస్సు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. దీనివలన భక్తి భావన పెరిగి.. మనసు భగవంతుని ఆరాధనపై కేంద్రీకృతం అవుతుందని పండితులు చెబుతున్నారు. 

ఆచమనం చేసేటప్పుడు మూడు సార్లు ఈ నామాలను చదువుతూ నీటిని తాగాలి

  •   ఓం కేశవాయ స్వాహా
  •   ఓం నారాయణాయ స్వాహా
  •   ఓం మాధవాయ స్వాహా

 ఆ తర్వాత గోవిందాయ నమ: అంటూ చేతులను కడుక్కోవాలి. 

అయితే, ఈ సందర్బంగా మరికొన్ని మంత్రాలు, నామాలను కూడా ఉచ్చరించడం చేస్తారు.

పూజలో ఆచమనం చేసేటప్పుడు ఆచరించాల్సిన నియమాలు

 స్నానం చేసిన తరువాత పంచ కట్టుకొని.. కండువా వేసుకొని బావి దగ్గరకు వెళ్లి చిన్న గిన్నెతో కాని బిందెతో గాని నీళ్లను తీసుకురావాలి.  ఒకవేళ బోర్​ ఉంటే అప్పుడే ఆన్​ చేసి నీరు పట్టుకోవాలి. అలా తీసుకొచ్చిన నీటితో మాత్రమే ఆచమనం చేయాలి.  అవకాశం ఉంటటే ఏ రోజు కారోజు నీటిని తెచ్చుకోవడం చాలా మంచిది.  అలా అవకాశం లేకపోతే... దేవుని పూజకు తెచ్చుకున్న నీటిని ఇతర అవసరాలకు వాడకూడదు. తరువాత రోజు పూజ సమయం వరకు అందులో కొద్దగా వీపూది వేసి.. మూతపెట్టి తాకకుండా పక్కన పెట్టి ఉంచాలి.  మళ్లీ పూజకు సిద్దం అయిన తరువాతనే ఈ నీటిపాత్రను అంటుకోవాలి. 

  మంత్రాలు తెలిసినవారు వాటిని శ్రద్ధగా జపిస్తూ ఆచమనం చేయాలి.  తొందరపాటుగా కాకుండా, పూర్తి ఏకాగ్రతతో ఈ కర్మను నిర్వహించాలి. ఆచమనం అనంతరం పూజ లేదా జపాన్ని ప్రారంభించడం శ్రేయస్కరంగా భావిస్తారు.