హోటల్ లేదా ఓయోలో రూమ్ తీసుకుంటున్నారా.. ఇక పై ఆధార్ జిరాక్స్ అవసరం లేదు..

హోటల్ లేదా ఓయోలో రూమ్ తీసుకుంటున్నారా..  ఇక పై ఆధార్ జిరాక్స్ అవసరం లేదు..

మీరు ఎక్కడికైనా ప్రయాణం చేసేటప్పుడు హోటళ్లలో చెక్-ఇన్ సమయంలో ఎదురయ్యే అతిపెద్ద సమస్య ఆధార్ కార్డు జిరాక్స్ (ఫోటోకాపీ) ఇవ్వడం. అయితే, ఈ ఇబ్బందులకు చెక్ పెడుతూ చెక్-ఇన్ ప్రక్రియలో కొత్త మార్పులు వస్తున్నాయి. ఇకపై హోటళ్లలో ఆధార్ కాపీ ఇవ్వాల్సిన అవసరం లేకుండా, ఈజీగా  డిజిటల్ పద్ధతిలో ఐడెంటిటీని నిర్ధారించుకునే వెసులుబాటు అందుబాటులోకి వస్తోంది.

ఈ కొత్త విధానంలో మార్పులు, ప్రయోజనాలు ఏంటంటే
QR కోడ్ & OTP ధృవీకరణ:
రూం బుక్ చేసుకునే సమయంలో  జిరాక్స్ ఇచ్చే బదులు క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి, మీ మొబైల్‌కు వచ్చే ఓటీపీ (OTP) ద్వారా సెకన్లలో వెరిఫికేషన్ పూర్తి చేయవచ్చు.

జిరాక్స్ తిప్పలు ఉండవు: ప్రయాణాల్లో ఉన్నప్పుడు లేదా అర్ధరాత్రి హోటల్‌కు వెళ్లినప్పుడు ఆధార్ జిరాక్స్ కోసం వెతుక్కోవాల్సిన పని ఇకపై ఉండదు.

డిజిటలైజేషన్‌కు ప్రాధాన్యం: ఐడెంటిటీ చెకింగ్ ప్రాసెస్ మరింత వేగవంతం చేయడానికి, పేపర్ వాడకాన్ని తగ్గించడానికి UIDAI ఈ డిజిటల్ విధానాలను ప్రోత్సహిస్తోంది.

డేటా భద్రత & గోప్యత: హోటళ్ల దగ్గర మీ ఆధార్ జిరాక్స్ ఉండిపోవడం వల్ల సమాచారం ఇతరుల చేతుల్లోకి వెళ్లే ప్రమాదం ఉండేది. డిజిటల్ చెక్-ఇన్ ద్వారా మీ వ్యక్తిగత సమాచారం దుర్వినియోగం కాకుండా సురక్షితంగా ఉంటుంది.

సింపుల్ గా చెప్పాలంటే, ఈ కొత్త డిజిటల్ విధానం వల్ల హోటల్ చెక్-ఇన్ ప్రాసెస్ చాలా వేగంగా, తేలిగ్గా, పూర్తి సురక్షితంగా మారుతుంది.