యూపీలో కుప్పకూలిన శిక్షణ విమానం.. పైలట్, కో పైలట్ ఇద్దరు మృతి

యూపీలో కుప్పకూలిన శిక్షణ విమానం.. పైలట్, కో పైలట్ ఇద్దరు మృతి

లక్నో: యూపీలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. శిక్షణ విమానం కుప్పకూలి పైలట్, కో పైలట్ ఇద్దరు మరణించారు. గురువారం (ఆగస్ట్ 28) మధ్యాహ్నం కాన్పూర్‌లోని గంగా నది ఒడ్డున ఉన్న నత్తా పూర్వా గ్రామం సమీపంలో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. 

అధికారుల వివరాల ప్రకారం.. రెండు ఇంజన్లు గల శిక్షణా విమానం ట్రైనింగ్‎లో భాగంగా గురువారం గాల్లో విహరిస్తుండగా నత్తా పూర్వా గ్రామ సమీపంలో ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ఘటనలో పైలట్, కో పైలట్ ఇద్దరు దుర్మరణం చెందారు. భారీ శబ్ధంతో విమానం కుప్పకూలడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురై ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. 

స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు, పరిపాలనా బృందాలు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకునిసహాయక చర్యలు ప్రారంభించాయి.  ఈ ఘటనపై అధికారులు దర్యాప్తు చేపట్టారు. విమాన ప్రమాదానికి సాంకేతిక లోపమా.. లేక మరేదైనా కారణం ఉందా అన్న కోణంలో ఆరా తీస్తున్నారు.