మూడు వారాలుగా దూసుకుపోతున్న బంగారం రేట్లు రెండు రోజుల నుంచి నెమ్మదించాయి. శ్రావణమాసం రెండో శుక్రవారానికి ఒక్క రోజు ముందు రేట్లు తగ్గటం చాలా మంది తెలుగు ప్రజలను సంతోషానికి గురిచేస్తోంది. శుభకార్యాలతో పాటు పూజాది కార్యక్రమాలకు షాపింగ్ చేయాలనుకుంటున్న వాళ్లు ముందుగా తమ నగరాల్లోని తగ్గిన ధరలను పరిశీలించి ముందుకు వెళ్లటం బెటర్.
ఆగస్టు 27న బంగారం రేట్లు స్వల్పంగా తగ్గాయి. ఆగస్టు 26 కంటే గ్రాముకు 24 క్యారెట్ల బంగారం రేటు దేశవ్యాప్తంగా రూ.77 తగ్గింది. దీంతో హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడప నగరాల్లో స్వచ్చమైన బంగారం రేటు రూ.16వేల 298గా కొనసాగుతోంది. ఈ నగరాల్లో 22 క్యారెట్ల బంగారం రేటు గ్రాముకు రూ.14వేల 940గా కొనసాగుతోంది.
గురువారం రోజున వెండి రేట్ల విషయానికి వస్తే.. ఆగస్టు 27, 2026న దేశవ్యాప్తంగా స్థిరంగా కొనసాగుతున్నాయి. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడపలో కేజీ స్వచ్ఛమైన వెండి రేటు కేజీ రూ.2లక్షల 65వేలుగా ఉంది. అంటే గ్రాము దాదాపు రూ.265 దగ్గర ఉంది.
