న్యూఢిల్లీ: ఈ ఏడాది వరల్డ్స్ మోస్ట్ అడ్మైర్డ్ (అత్యంత ఆదరణ) కంపెనీస్ లిస్టులో అమెరికా టెక్ కంపెనీ యాపిల్ మొదటి స్థానాన్ని దక్కించుకుంది. ఇది వరుసగా 19వ సారి ఈ ఘనత సాధించిందని బిజినెస్ మ్యాగజైన్ ఫార్చ్యూన్ రిపోర్ట్తెలిపింది. దీని ప్రకారం.. ఆవిష్కరణలు, సిబ్బంది నిర్వహణ, సామాజిక బాధ్యత, ఆర్థిక స్థిరత్వం, పోటీతత్వం తదితర అన్ని విభాగాల్లోనూ యాపిల్ టాప్‌లో నిలిచింది. మూడుల మందికి పైగా కార్పొరేట్ ఎగ్జిక్యూటివ్‌లు, డైరెక్టర్లు, అనలిస్టుల అభిప్రాయాల ఆధారంగా ఈ ర్యాంకులను కేటాయించారు. ఈ లిస్టులో మైక్రోసాఫ్ట్, అమెజాన్, ఎన్విడియా, జేపీ మోర్గాన్ చేజ్ మిగతా స్థానాల్లో నిలిచాయి.
