ఫ్యామిలీతో కలిసి ఎక్కడికైనా విహార యాత్రకు, పుణ్యక్షేత్రాలకు వెళ్లినా స్నాక్స్, టిఫిన్స్ తీసుకెళ్లడం మన ఇండియన్ ఫ్యామిలీస్ కి అలవాటే. కారులో వెళ్లినా, బస్సులో, రైల్లో... ఎలా వెళ్లినా లగేజ్ లో ఒక బాగ్ మొత్తం స్నాక్స్ కి కేటాయించడం మాములే. రైళ్లలో ఇలాంటి సీన్స్ చాలా కామన్. అయితే.. ఫ్లైట్ లో కూడా మినీ క్యాంటీన్ ఓపెన్ చేసేశారు. ఫ్యామిలీ మొత్తం స్నాక్స్ పంచుకొని తింటూ.. ఫ్లైట్ ని క్యాంటీన్ లా మార్చేశారు.ఒకేసారి అందరూ స్నాక్స్ ఓపెన్ చేయడంతో వాటి వాసనకు తోటి ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
డిస్పోజబుల్ ప్లేట్లలో ఫ్యామిలీ మొత్తానికి స్నాక్స్ పంచుతోంది ఓ మహిళ. రకరకాల స్వీట్స్, స్నాక్స్, సాస్ లు తింటుండటం వీడియోలో ఉంది. సమోసాలు, ధోక్లాలు వంటివి నమ్‌కీన్ మిక్చర్ తింటూ ఎంజాయ్ చేశారు. ముందే అన్నీ పక్కాగా ప్లాన్ చేసుకొని తమ ఫ్లైట్ జర్నీని ఫ్యామిలీ గెట్ టు గెదర్ గా మార్చేశారు.
India lacks civics sense 😭
— Chota Don (@choga_don) August 26, 2026
A North Indian family opened a cafeteria on a running flight. Fifteen people sat together, got their own food, and walked around the cabin carrying plates.
The problem isn't just the food, its smell will linger for the entire journey, and some… pic.twitter.com/Wl9scwON1O
అయితే.. ఈ వీడియోకు రకరకాల కామెంట్స్ తో రియాక్ట్ అవుతున్నారు నెటిజన్స్. మన ఇండియన్స్ కి అస్సలు సివిక్ సెన్స్ లేదని.. ఎక్కడున్నామన్న స్పృహ లేకుండా ప్రవర్తిస్తుంటారని ఓ నెటిజన్ కామెంట్ చేయగా.. ఈ నార్త్ ఇండియన్స్ అంతా ఇంతేనంటూ మరో నెటిజన్ కామెంట్ చేశారు. స్నాక్స్ ఘాటు వల్ల తోటి ప్రయాణికులు ఇబ్బంది పడుతుంటే ఫ్లైట్ సిబ్బంది ఏం చేస్తున్నారంటూ మరో నెటిజన్ కామెంట్ చేశారు.
ALSO READ : లంచాలు సమానంగా పంచుకుందాం..
వీళ్ళ హడావిడి కేవలం స్నాక్స్ తోనే ఆగలేదు. కొంతమంది అమ్మాయిలు మేకప్ చేసుకుంటూ రెడీ అవుతున్నారు.వీడియో చివర్లో, స్నాక్స్ వడ్డించిన మహిళ వాడిన డిస్పోజబుల్ ప్లేట్లను, ఇతర వ్యర్థాలను ఒక పెద్ద చెత్త సంచిలో సేకరిస్తూ కనిపించింది.
